7 October 2016

ప్రత్యేకహోదా..నిరాహార దీక్షకు ఏడాది

  • హోదా కోసం గుంటూరు వేదికగా ఆమరణ దీక్ష
  • దీక్ష ఏడవ రోజుకు చేరుకున్న సమయంలో బాబు కుట్రలు
  • బలవంతంగా దీక్ష భగ్నం 
  • హోదాపై మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • కేసులకు భయపడి హోదాను తాకట్టు పెట్టిన బాబు
  • పార్లమెంట్, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీకి తూట్లు
  • బీజేపీ, టీడీపీల మోసంపై ప్రజాగ్రహం
  • హోదా కోసం వైయస్ జగన్ అలుపెరగని పోరు

గుంటూరుః ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు వేదికగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష.. నేటతో ఏడాది పూర్తిచేసుకుంది. ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రం, తెస్తామన్న టీడీపీ రెండు పార్టీలు ఏపీ ప్రజలను వంచించాయి. పార్లమెంట్, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంగలో కలిపాయి. విభజన సమయంలో ఆనాటి ప్రదాని హోదా ఐదేళ్లు అంటే, కాదు పదేళ్లు కావాలని బీజేపీకి చెందిన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు కోరారు. హోదా పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు నాయుడు ఎన్నికలముందు ఊదరగొట్టారు. అంతే కాదు ప్రత్యేకహోదా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాన్ని మర్చి ప్రజలను మోసం చేశారు. దీంతో, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం సంజీవని లాంటి ప్రత్యేకహోదాను సాధించేందుకు ప్రధాన ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు.  గుంటూరు నగర శివారు నల్లపాడు రోడ్డులో వైయస్ జగన్ స్వయంగా 07-10-2015 తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాణాలను పణంగా పెట్టి హోదా కోసం పోరాడుతున్న జననేతకు మద్దతుగా రాష్ట్రప్రజానీకమంతా నల్లపాడుకు కదలివచ్చింది. హోదా కోసం గర్జించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. వైయస్ జగన్ దీక్షతో వణికిపోయిన ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. జనం కోసం జననేత...జననేత కోసం జనం ఒక్కటై హోదా పోరాటం సాగించడంతో బాబుకు ముచ్చెమటలు పట్టాయి.  గుంటూరుకు రాకుండా అడ్డుకునేందుకు శతవిథాల ప్రయత్నించి తోకముడిచారు. మొక్కవోని దీక్షతో హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్న వైయస్ జగన్ కు సంఘీభావంగా తరలివచ్చి ప్రతీ పౌరుడు తోడుగా నిలిచారు. ఆరోగ్యం నీరసించిపోయినా తన వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ జగన్ దీక్ష కొనసాగించారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున వైయస్ జగన్ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఆరోగ్యం బాగా క్షీణించిపోవడంతో దీక్ష విరమించాలని పార్టీ నేతలు కోరినా ఏమాత్రం లెక్కచేయలేదు. తనకన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వైయస్ జగన్ దీక్షను నిర్విరామంగా కొనసాగించారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బాబు కుయుక్తులు పన్నారు. హోదా కోసం పోరాడుతున్న ప్రజలగొంతు వినపడకుండా చేసేందుకు పోలీసులను ఉసిగొల్పాడు. వైయస్ జగన్ దీక్ష ఏడవ రోజుకు చేరుకున్న సమయంలో దొంగచాటుగా అర్థరాత్రి పోలీసులను పంపించి బలవంతంగా భగ్నం చేశారు.   గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐనా కూడా వైయస్ జగన్ వెనకడుగు వేయకుండా ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగించారు. అక్కడ వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ప్రత్యేకహోదా కోసం అనేక దపాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వైయస్సార్సీపీ తన పోరాటాలు కొనసాగించింది. ధర్నాలు, దీక్షలు, బంద్ లు, యువభేరి సదస్సులతో ప్రత్యేకహోదా ఆకాంక్షను చాటిచెప్పింది. అసెంబ్లీలోనూ, వెలుపల హోదా కోసం అలుపెరగని పోరాటం కొనసాగించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టింది. ఐనా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల హక్కును కేంద్రానికి తాకట్టుపెట్టాడు. ఐదుకోట్ల మంది ఆంధ్రులను నిట్టనిలువునా దగా చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి హోదా కోసం పోరాడాల్సింది పోయి హోదా వల్ల ఏమొస్తాయంటూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. హోదా ఏమైనా సంజీవనా, హోదాతో రాష్ట్రం స్వర్గమైపోతుందా, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్తవద్దంటుందా అంటూ పూటకో మాట మాట్లాడుతూ పథకం ప్రకారం నీరుగార్చుతూ వచ్చారు. ముఖ్యమంత్రే అడగనప్పుడు హోదా ఎందుకు ఇవ్వాలన్న ధోరణిలోకి కేంద్రం వెళ్లింది. 

రెండున్నరేళ్లుగా అదిగో హోదా, ఇదిగో హోదా అంటూ ఊరిస్తూ వచ్చిన టీడీపీ, బీజేపీలు ఉసూరుమనిపించాయి. హోదా కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఎప్పటికైనా హోదా తీసుకొచ్చేది మేమే అన్న చంద్రబాబు...హోదాని కాదని ప్యాకేజీకి మోకరిల్లాడు. అర్థరాత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను బాబు స్వాగతించించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బీజేపీ, టీడీపల తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. హోదాను ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు బీజేపీ కుంటిసాకులు వెతుకుతోందని మండిపడ్డారు. ప్యాకేజీని స్వాగతించడానికి బాబు ఎవరని నిలదీశారు. ప్రత్యేకహోదా ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని నొక్కి వక్కానించారు. బాబు తన జేబులు నింపుకోవడం కోసం హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీని కోరడాన్ని ముక్తకంఠంతో ఖండించారు. 

హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైయస్ జగన్ అనేక సందర్భాల్లో చాటిచెప్పారు.  విద్యార్థులు, యువత రాష్ట్ర ప్రజలకు హోదా ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారు. బీజేపీ, టీడీపీలు చేస్తున్న మోసాలను ఎంగడుతూ హోదా పోరాటంలో అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. ప్రత్యేకహోదా సాధించేవరకు విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హోదా ఒక్క జగన్ తో సాధ్యం కాదని, అందరం కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తితో హోదా కోసం ఉద్యమిద్దామని ప్రతీ ఒక్కరినీ కోరారు. ప్రత్యేకహోదాను అమ్మేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. రాష్ట్రానికి హోదా సాధించేవరకు పోరాటాన్ని కొనసాగిద్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రభుత్వాలను ఢిల్లీపీఠంపై కూర్చోబెడదామని వైయస్ జగన్ తేల్చిచెప్పారు. 

No comments:

Post a Comment