3 October 2016

ఈ రకంగా దండయాత్ర చేస్తే పోలా..?

  • రెండున్నరేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా..?
  • అన్ని తాత్కాలికమంటూ తరలిపోతున్నాడు
  • రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారు
  • ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై చట్టవ్యతిరేక చర్యలు
  • పోలీసులు, తూటాలతో ఉద్యమాలని అణచివేయలేరు
  • బాబును ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుంది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 

హైదరాబాద్ః చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోవడం దురదృష్టకరమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అన్నీ తాత్కాలిక కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ నుంచి తరలిపోవడం దారుణమన్నారు. సగపాలన పూర్తయ్యాక కూడా ఇంకా తాత్కాలికమంటూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక శాసనసభ, మండలి వెనుక జరుగుతున్న తంతంగం చూస్తే బాధేస్తోందన్నారు. రెండున్నరేళ్లలో పర్మినెంట్ బిల్డింగ్ లు కట్టే అవకాశం ఉన్నా కట్టకపోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు.  అమరావతిలో శంకుస్థాపన రాయి వేయడం తప్ప బాబు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే బాబు, లోకేష్ లు తాత్కాలిక కార్యక్రమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రం విడిపోయాక మంచి రాజధాని కావాలి, పరిపాలన మంచిగా జరగాలని అంతా కోరుకున్నామన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం దారుణంగా ఉందని అంబటి విమర్శించారు. ఎలాంటి వసతులు కల్పించకుండానే వెలగపూడి కేంద్రంగా అమరావతిలో పరిపాలన సాగించేందుకు హడావిడిగా ఉద్యోగులను తరలించడం సరికాదన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. 

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా... దోపిడీకి అడ్డుగా ఉందనే, ఉన్నపళంగా బాబు విజయవాడ తరలిపోయారని అంబటి ధ్వజమెత్తారు.  హైదరాబాద్ సెక్రటేరియట్ లో జీవోలు ఇష్యూ చేసినా, డబ్బులు ఖర్చుపెట్టినా ఏదైనా నేరం జరిగితే ఇక్కడి పోలీసులు, డీజీపీ, సీఐడీ పరిధిలోకి వస్తుందన్నారు. హైదరాబాద్ లో ఉండి చేస్తే తన ఆధీనంలో లేని పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయలేడు గనుకే బాబు తరలిపోయారని దుయ్యబట్టారు. మేనేజ్ చేసుకునే పోలీస్ వ్యవస్థ విజయవాడలో ఉంది కాబట్టి, అక్కడకు తరలివెళ్లాలనే తాపత్రయం మినహా ప్రజలకు అందుబాటులో రాజధాని తీసుకెళ్లాలన్న చిత్తశుద్ది బాబుకు ఏ కోశాన లేదన్నారు.   బాబు ప్రతీ కార్యక్రమంలో వైట్ కాలర్ క్రైం, డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రాష్ట్రం చీలిపోయి మూడేళ్లు రాబోతోంది. దేశంలో ఎవరిని నమ్మకుండా సింగపూర్, జపాన్, మలేషియా వాళ్ల మీద ఆధారపడి  ఒక్క కట్టడం కూడా కట్టని దౌర్భగ్యంలో ఎందుకున్నారని బాబును నిలదీశారు.  అన్ని వసతులతో ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ ఉద్దేశ్యపూర్వకంగా వసతులు కల్పించకుండా ఉద్యోగులను తరలించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలని సూచించారు. 

భూసేకరణకు వ్యతిరేకంగా, ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేస్తే  పోలీసు వ్యవస్థను ఉసిగొల్పి అణిచివేయాలని చూడడం ప్రభుత్వానికి తగదన్నారు. ఉన్నతాధికారుల మీటింగ్ లో ప్రివెంటివ్ ఆఫ్ డిటెక్షన్ యాక్ట్ అప్లై చేయాలని బాబు చెబుతున్న ధోరణి చూస్తుంటే డిక్టేటర్ పాలనలో ఉన్నామా...ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు.  ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై ఉద్యమిస్తున్న వారిపై ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ పెట్టి  పోలీసుల రాజ్యం, తూటాల రాజ్యంతో అణిచేయాలని చూస్తే ప్రజలు తరమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆక్వా బాధితులకు మద్దతుగా ఉద్యమం చేస్తే గుండాలు, క్రిమినల్స్ మీద ఎటాక్ చేసినట్లు పోలీసులను ఉసిగొల్పి అరెస్ట్ చేసి, నిర్బందించి జైలు పాలు జేశారు. తిరుపతికి వెంకయ్యనాయుడు వస్తే చాలు వైయస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని నిర్బంధించారు. వెంకయ్యనాయుడుకు సన్మానం అనగానే ప్రతిపక్షం వాళ్లను అరెస్ట్ చేసి దండాలు వేస్తున్నారు. ఇదేనా సన్మానం...? పోలీస్ వ్యవస్థను అఢ్డుపెట్టుకొని బాబు పరిపాలన కొనసాగించడం దుర్మార్గమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను తీసుకొచ్చి వైయస్సార్సీపీ, ప్రజాసంఘాలమీద అమలు చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాబును హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ శాంతిభద్రతలు కాపాడేందుకు, క్రిమినల్స్ ను అణిచేసేందుకు ఉండాలి గానీ..చట్టానికి వ్యతిరేకంగా బాబు ఏది చెబితే అది చేయడానికి కాదన్నారు.  అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న సంగతి డీజీపీ, ఐపీఎస్, ఐఏఎస్ లు తెలుసుకోవాలన్నారు.  ఎన్టీఆర్, ఇందిరాగాంధీలు చిత్తుగా ఓడిన సందర్భాలున్నాయి. బాబు కూడా చిత్తుగా ఓడిపోయిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

దోమల మీద దండయాత్ర చేయాలని బాబు పిలుపునివ్వడం హాస్యాస్పదమని అంబటి తూర్పారబట్టారు.  ఎంత పనికిమాలిన ప్రభుత్వం కాకపోతే దోమలపై దండయాత్ర ఏంటని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ఏం పోయే కాలం వచ్చిందని తూర్పారబట్టారు. ఈసందర్భంగా ఓ తల్లి, పిల్లదోమ కథ చెప్పిన అంబటి ప్రభుత్వంపై ఛలోక్తులు విసిరారు. దోమలు మనుషుల రక్తాన్ని ఏవిధంగా పీల్చుకొని తాగుతాయో, బాబు కూడా అదే మాదిరి ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతున్నాడని..బాబుకు కాంపిటీషన్ గా ఉన్నామనే మనల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని పిల్ల దోమ ప్రశ్నకు తల్లిదోమ బదులిచ్చిన విషయాన్ని అంబటి వివరించారు. చేయాల్సినవి చేయకుండా దోమల మీద దండయాత్రలు. ప్రతిపక్షం మీద పీడీయాక్ట్ లతో అణిచేయాలని చూడడం అవివేకమని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు హైదరాబాద్ లోనే ఉంటానని ప్రగల్భాలు పలకిన బాబు...ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో కేసులు పెడతారని భయపడి హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్లిపోయాడని అన్నారు. కేసీఆర్, బాబుకు మధ్య వెంకయ్యనాయుడు రాజీ కుదిర్చారని చెప్పారు. బాబుకు ఎక్కడా రాజధాని నిర్మాణ ఆలోచనే లేదని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం ముసుగులో  విదేశాలకు దోచిపెట్టారు గనుకే న్యాయస్థానాలు కూడా బాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాయని తెలిపారు.  

దోమలపై దండయాత్ర కాదని బాబు, మంత్రులు, లోకేష్ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉపయోగించాలని అంబటి పేర్కొన్నారు. ఇవాళ కాకపోయినా భవిష్యత్తులో అది జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని విమర్శించారు. బాబు తన మాటకు ఎదురుచెప్పని వారిని కీలకమైన ఫోకల్ లో పాయింట్స్ లో వేసుకొని అరెస్ట్ లు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏదో ఓ రోజు ధర్మంగా వ్యవహరించే రోజు వస్తుందన్నారు. చట్టాలు చేతిలో ఉన్నాయి కదా అని ప్రతిపక్షాలను అణిచేయాలని చేయడం బాబు చేతగాదని అంబటి తేల్చిచెప్పారు. ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగుస్తాయని, చరిత్ర చదువుకోవాలని బాబుకు హితవు పలికారు. ప్రతిపక్షాలపై  ప్రివెంటివ్  డిటెక్షన్ యాక్ట్ ప్రయోగిస్తే అది  వికటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

No comments:

Post a Comment