4 June 2016

తప్పుల్ని ప్రశ్నిస్తే తప్పవుతుందా...!

  • చంద్రబాబు మోసాలు, అబద్దాల్ని ప్రశ్నిస్తే తప్పా..!
  • ఎమ్మెల్యేలను కొనేందుకు రూ. 600 కోట్లు ఎలా వచ్చాయి
  • మోసాలు చేస్తున్న బాబుని చెప్పుతో కొట్టడం తప్పవుతుందా
  • అనంతపురం జిల్లా రైతు భరోసా యాత్రలో ప్రశ్నించిన వైయస్ జగన్


అనంతపురం : విచ్చలవిడిగా అవినీతి చేస్తున్న చంద్రబాబు అక్రమాల్ని ప్రశ్నించటం తప్పెలా అవుతుందని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. మోసాలుచేస్తున్న చంద్రబాబుని చెప్పుతో కొట్టాలనటంలో తప్పేముందని ఆయన నిలదీశారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా యాడికి లో తనను కలిసేందుకు తరలి వచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించారు. వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.



అందరికీ వెన్నుపోటు
       చనిపోయిన కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు భరోసా యాత్ర చేసేందుకు ఇక్కడకు రావడం జరిగింది. రైతు, చేనేతలు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని బాబు తన మనస్సాక్షిని అడగాల్సింది పోయి ఎగతాళి చేస్తున్నాడు. రైతులు, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారని అవహేళన చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు. అయిపోయాక చేస్తున్నదేమిటి. ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా. టీవీ ఆన్ చేస్తే కనిపించేది, వినిపించేది ఒకటి. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని వినిపించేది. రైతులు, మహిళలు, చేనేతల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలని వినిపించేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, అక్కచెల్లెల్లు, చేనేతలు, చదువుకునే చిన్నపిల్లలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు. 
జాబు రావాలంటే బాబు రావాలని వినిపించేది. ఎన్నికలయ్యాక బాబుకు ముఖ్యమంత్రి జాబొచ్చింది. ఉన్న జాబులు ఊడబెరుకుతున్నాడు. జాబ్ లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని కరపత్రాలు పంచాడు.రెండేళ్లలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా..! కోటి 75 లక్షల ఇళ్లు ఎదురుచూస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇటువంటి బాబు చేసిందేమైనా ఉందంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం మాత్రమే. సిగ్గులేదా బాబు నీకు. అవినీతి రహిత రాష్ట్రం గురించి మాట్లాడతావా. చదువుకునే పిల్లలతో ప్రమాణం చేయిస్తావ్.


అవినీతి సొమ్ముతో కొనుగోళ్లు
 ఇసుక నుంచి బొగ్గు దాకా అవినీతే. రాజధాని భూముల నుంచి గుడి భూములు అమ్మేదాకా అవినీతే. గుడిలో, గుడిలో లింగాన్ని కూడా మింగుతున్నాడు. విచ్చలవిడిగా ప్రజల గొంతు ఎక్కడా వినపడకూడదని ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దురుద్దేశ్యంతో ఎమ్మెల్యేలను కొంటున్నాడు. 17 మందిని 30 కోట్ల చొప్పున అంటే 600కోట్లకు కొన్నాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఇంత సొమ్ము. పట్టపగలు ఇలా చేస్తుంటే అడిగే పరిస్థితి లేదు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో వీడియోలతో దొరికిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆడబ్బు.

శ్రీశైలంకు నీళ్లు రాకముందే పైనుంచి పైకి నీళ్లు తోడుకుపోతుంటే బాబు కేసీఆర్ ను ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగే పరిస్థితి లేదంటే దారుణం. అడిగితే ఓటుకు కోట్లు కేసులో జైలు పాలు చేస్తారని భయం. తన స్వార్థం కోసం ఐదుకోట్లమందిని రోడ్డున నిలబెట్టాడు. ప్రత్యేక హోదా అడగడం లేదు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీలుండవు. రాయితీలు వస్తాయి. సింగపూర్, దుబాయి అవసరం లేదు. రాష్ట్రానికి వస్తారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలొస్తాయి. మంత్రులను ఉపసంహరించుకుంటామని అల్టిమేటం ఇవ్వడం లేదు. సీబీఐచేత ఎంక్వైరీ చేయించి జైల్లో పెడతాడని తాకట్టు పెట్టాడు. మోసం చేసిన బాబుని చెప్పులతో కొట్టడం తప్పా అని నేనడుగుతున్నా. అప్పుడు ఎన్నికలహామీలు గుర్తుకువస్తాయి. అప్పుడు మోడీ దగ్గర మంత్రులను ఉపసంహరించుకుంటాడు. లేదంటే లేదు మరి.
అక్రమాల్ని ప్రశ్నించటం తప్పా..! 
బాబూ, నీవు తప్పు చేస్తున్నావని నిలదీస్తే అది తప్పట. ఎవరూ ప్రశ్నించకూడదట. బాబు మోసం చేసినా ఎవరూ అడగడకూడదట. వెన్నుపోటు పొడిచినా ఎవరూ అడగకూడదట. చేనేత కుటుంబాల దగ్గరకు వెళ్లా. 41 వేల రూపాయలు రుణాలు ఉన్నాయి. నిన్న తిట్టా.  రాష్ట్రవ్యాప్తంగా 13 చేనేత కుటుంబాలు చనిపోయారు. యాడికి వచ్చినప్పుడు అక్కచెల్లెలు వారు పడుతున్న బాధలు ఇవి. వీళ్లకు సబ్సిడీ రావడం లేదు. రుణాలు మాఫీ కాలేదు. లక్ష రూపాయలు అదనపు రుణాలు అన్నారు. ఇళ్లు, షెడ్డు అన్నారు . చేసిన పాపాన పోలేదు. 

87 వేల కోట్ల రైతులకు రుణాలుంటే అవి కట్టొద్దంటే కట్టని పాపానికి  వడ్డీలే 25 వేల కోట్లు బ్యాంకులకు వడ్డీలు కడుతున్నారు. వడ్డీల్లో మూడోవంతు కూడా మాఫీ చేయలేదు. చంద్రబాబును ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం బతకదు. బాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసే రోజు దగ్గర్లోనే ఉంది. బాబులో మార్పు రావాలంటే మనమంతా ఒక్కటై ఒత్తిడి తేవాలి. మనపక్కనే తాడిపత్రి ఎమ్మెల్యేలను అడగండి. యాడికి కెనాల్ నీళ్లు రావటం లేదని నిలదీయాలి.

ఈపోరాటం ఇంతటితో ఆగదు. కొనసాగించే కార్యక్రమంలో మీ దీవెనలు కావాలి. 
అని ఘాటుగా వైయస్ జగన్ నిలదీశారు.

ప్రజలు కడుపుమండి అల్లాడుతుంటే రాళ్లతో కొట్టరా..?

  • తెలుగుదేశం నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి
  • రెండేళ్లలో ఒక్క హామీ అయినా నేరవేర్చారా
  • విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు
  • రాజధాని మొదలు దేవుడి భూముల వరకు లూటీ చేస్తున్నారు
  • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన బొత్స సత్యనారాయణ
హైదరాబాద్ః ఎన్నికల హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన ప్రతిపక్షనాయకుడు డిమాండ్ చేస్తుంటే...వాగ్ధానాలు అమలు చేయాల్సింది పోయి టీడీపీ నేతలు వైయస్ జగన్ పై విమర్శలకు దిగడం దుర్మార్గమని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మైకు ఉంది కదా అని తెలుగుదేశం నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు రాళ్లతో, చెప్పులతో కొట్టరా అని నేతలను హెచ్చరించారు.  ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన సంస్కృతి చంద్రబాబుదని బొత్స ధ్వజమెత్తారు. ప్రజల అభిప్రాయాన్నే వైయస్ జగన్ వ్యక్తపరిచారని ఆయన స్పష్టం చేశారు. 

తెలుగుదేశం నేతల నోటికి అడ్డూ, అదుపు లేకుండా పోయిందని బొత్స మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నించడమే తప్పా..?  దేనికి ఆవేశపడుతున్నారని తెలుగుతమ్ముళ్లను నిలదీశారు. ఏపీకి అన్యాయం జరిగేలా ఎగువరాష్ట్రం ప్రాజెక్ట్ లు కడుతుంటే నోరు మెదపని మీరా మాట్లాడేది అంటూ తెలుగుదేశం నేతలపై బొత్స విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఛార్జిషీటులో 23 సార్లు బాబు పేరు పెట్టారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.  హామీలు నిలబెట్టుకోకపోతే, విలువలు కాపాడుకోకపోతే, జనం సొమ్ము దోచేస్తుంటే.....బాబును రాష్ట్ర ప్రజానీకం క్షమించదని బొత్స హెచ్చరించారు. 

రాజకీయాల్లో ఏవైనా తప్పులు జరిగితే  దాన్నితాము సరిదిద్దుకొని పనిచేశామే గానీ....బాబు లాగా నిస్సిగ్గుగా తప్పుల మీద తప్పుల చేస్తూ ప్రజలను వంచించలేదని దుయ్యబట్టారు. రెండేళ్లలో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా బాబు..? మీ పాలనలో ఏ ఒక్కరైనా సంతృప్తిగా ఉన్నారా...?  రాత్రి ఒకటి, పగలు మరొకటి మాట్లాడుతూ జీవోలు విడుదల చేస్తారు. వ్యవస్థలన్నా, ప్రజలన్నా బాబుకు ఏమాత్రం గౌరవం లేదని,  మాటలతో కప్పిపుచ్చుకుంటారని బొత్స విమర్శించారు.  ప్రజలు కడుపుమండి అల్లాడుతుంటే...మీరు దోపిడీ సొమ్ముతో విదేశాలు పట్టుకు తిరుగుతున్నారు.  విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రం, దేశం పరువును తీస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తూ...పిల్లలతో ప్రమాణం చేయిస్తారా..? ఒక్కసారి గ్రామాలకు పోయి చూడండి. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుందని అదికార టీడీపీని హెచ్చరించారు.  

వైస్రాయ్ హోటల్  దగ్గర ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన దానికి ఏం సమాధానం చెబుతారు బాబు. అలాంటి సంస్కృతి ఉన్న మీరా మాట్లాడేది.  వైయస్ జగన్ మానసిక స్థితి బాగోలేదని యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. ఓ పక్క ఖజానా ఖాళీ అయిపోయింది, రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే....జీడీపీ రెండెంకల వృద్ధి రేటు సాధించామని చెబుతున్నారు.  మీ మానసిక స్థితి బాగా ఉందా యనమల. ఖజానా ఖాళీ అయితే రెండెంకల జీడీపీ ఎలా వస్తుంది. ఏవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ద్వంద్వవైఖరితో మాట్లాడుతున్న మీకా మాకా మానసిక స్థితి బాగోలేనిది అంటూ  బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ప్రతి అంశాన్ని వ్యాపార దృక్పథంతో చూస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారు. డబ్బున్నవాళ్లకే రాజ్యసభ సీట్లు అమ్ముకుంటున్నారని  సొంత పార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారు.  దీనికేం సమాధానం చెబుతారు బాబు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరినీ మోసం చేశారు. రాజధాని భూములు, అసైన్డ్ భూములు దోచుకున్నారు. దానిపై ఎంక్వైరీ లేదు. పైపెచ్చు కొనుక్కుంటే తప్పేంటని మాట్లాడుతున్నారు.  ఆఖరికి  దేవాదయ భూములు కూడా దోచుకుంటున్నారు.  దానిపైనా విచారణ లేదు. ఇసుక, మట్టి సహా పంచభూతాలను దోచేస్తున్నారని బొత్స నిప్పులు చెరిగారు. 

దీనికి తోడు కేంద్రకేబినెట్ లో ఉన్న ఒక్కగానొక్క మీ మినిస్టర్ ఆశోకజపతి రాజు స్కాం బయటపడింది. లోకేష్, అప్పారావు మధ్య లాలూచీ...అశోకగజపతి రాజు మధ్యవర్తిత్వం సంగతేమిటి బాబు..? ఇన్ని అవకతవకలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అవినీతిని సహించనని మాట్లాడే మీరు దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు. నాయకుడే ప్రధాన ముద్దాయి అయినప్పుడు చర్యలు ఎక్కడ ఉంటాయని బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. బాబు మీ పార్టీ నాయకులే మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి మనిషిని ఏరకంగా చూడాలని ప్రతిపక్ష నేత అంటే దానికి రాద్దాంతం చేస్తారా..?  ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలతో అధికారంలోకి వచ్చిన మీరు.... ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆత్మపరిశీలన చేసుకొని బుద్ధిగా మెలిగి ప్రజాపరిపాలన మీద దృష్టి పెట్టాలి. 

3 June 2016

చంద్రబాబుని చెప్పులతో తరిమికొట్టాలి. ఎందుకంటే..!

  • అవినీతిలో కూరుకుపోయిన బాబు ప్రతిజ్ఞలా
  • ప్రజలను ఘోరంగా అవహేళన చేస్తున్నాడు
  • ప్రజలతో ప్రమాణం చేయించే నైతిక హక్కు బాబుకు లేదు
  • అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నాడు
  • అనంతపురం జిల్లా పర్యటనలో జననేత వైయస్ జగన్ మండిపాటు 
అనంతపురం: నిండా అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు...నవనిర్మాణ దీక్ష పేరుతో అవినీతి రహిత రాష్ట్రం కోసం పాటు పడాలంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం విడ్డూరమని ప్రతి పక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకొని ఆ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు...ప్రజలతో ప్రమాణం చేయించే నైతిక హక్కు ఎక్కడిదని నిలదీశారు. చంద్రబాబు ప్రజలను ఘోరంగా అవహేళన చేస్తున్నాడని  వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా రెండో రోజు వైయస్ జగన్ తాడిపత్రిలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే...
 దొరికిన దొంగ
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయల బ్లాక్ మనీ సూట్ కేసులిస్తూ పట్టుబడ్డారు. ఆ గొంతు చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో నిర్ధారణ అయ్యాక కూడా..బాబు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అవహేళన చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకున్న అవినీతి సొమ్ముతో ...పట్టపగలే ప్రజలు చూస్తుండగానే ఎమ్మెల్యేలకు రూ.30 నుంచి 40 కోట్లు ఇచ్చి కొనుగోళ్లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నాడు. చంద్రబాబుకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత సొమ్ము. ఇప్పటికే 17మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇంకా కొనుగోళ్లు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఎమ్మెల్యేల రేటు రూ. 50 కోట్లు అంటున్న మాటలు వింటున్నాం. ఎక్కడి నుంచి వస్తోంది ఈసొమ్మంతా . ఇలాంటి పెద్దమనిషి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా  
అన్నింటా అవినీతే
ఇసుక నుంచి బొగ్గు కొనుగోళ్ల దాకా...కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి రాజధాని భూముల దాకా అంతా అవినీతే. చివరకు అవినీతి ఏ స్థాయిలో ఉందంటే దేవుని భూములు సైతం తన బినామీలకు తక్కువ రేట్లకు కట్టబెడుతున్నారు . తద్వారా వందల కోట్ల రూపాయలు చంద్రబాబు తన జేబుల్లో నింపుకుంటున్నాడు. చెన్నైలోని  వేల కోట్ల రూపాయలు పలికే అమరేశ్వరుడి భూములని కేవలం రూ.  22 కోట్లకే బాబు తన బినామీలకు అమ్ముతున్నాడంటే..ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి మరొకరు ఉంటారా. గుడిని, గుడిలో లింగాన్ని సైతం మింగేసే చంద్రబాబు  అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరం. ఆఖరికి  పిల్లల చేత కూడా ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయమని చెబుతున్నాడంటే...ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. 
 రుణమాఫీ బూటకం
చంద్రబాబు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొడితేగానీ అప్పుడు ఆయన చెప్పింది జరుగుతుంది.  చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈరెండేళ్లలో చేయని మోసం లేదు.  ఎన్నికలకు ముందు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు. రుణాలు మాఫీకాకపోవడంతో  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 87 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ అన్నాడు. 87వేల కోట్లపైన  అపరాధ వడ్డీతో కలిపి రైతుల దగ్గరి నుంచి  బ్యాంకులు ముక్కు పిండీ వసూలు చేస్తున్నాయి. ఈపెద్దమనిషి చేసిన మాఫీ ఆవడ్డీల్లో మూడోవంతు కూడా సరిపోలేదు. అలాంటిది రుణాలన్నీ  మాఫీ అయ్యాయని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. ఇలాంటి మనిషికి నవనిర్మాణ దీక్షలో ప్రతిజ్ఞ చేయమని చెప్పే నైతిక హక్కు ఉందా అని నేనడుగుతున్నా.
దారుణమైన అబద్దాలు చెబుతున్నాడే
ఇక్కడే ఉన్న చేనేత కార్మికుడి ఇంటికి వచ్చి అడగండి. రూ. 40 వేలు చేనేత కార్మికుడికి రుణాలు ఉన్నాయి. అవి మాఫీ కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి.  కష్టపడి పనిచేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితి డ్వాక్రామహిళలది. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అన్నాడు. మాఫీ కాదుకదా అదనంగా రూ. 2 వడ్డీలు కడుతున్న పరిస్థితి. రుణాలు మాఫీ చేయకపోగా ముష్టివేసినట్లు మూడు వేల రూపాయలు ఇప్పిస్తానని చెబుతున్నాడు.  ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా..?  
పాలనంతా మోసం, అబద్దాలు
ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి  కావాలి అన్నాడు. జాబు లేనివారికి నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఎన్నికలయ్యాక ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశాడు. ఈమాదిరిగా ప్రతిజ్ఞ చేయమని చెప్పే నైతిక హక్కు ఉందా అని బాబును అడుగుతున్నా . బాబు పాలనంతా మోసం, అబద్దాలు తప్ప ఏమీ లేదు. ఆనాడు అడ్డగోలుగా దగ్గరుండి చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టించారు.  హోదా తెస్తామని చెప్పారు. హోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇవ్వాలని చెప్పిన...ఈపెద్దమనిషి  ఇవాళ హోదాను నీరుగారుస్తున్నాడు. 
బాబుకి భయం
కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ లు కడుతుంటే...ఏపీకి నీళ్లు రావని తెలిసీ కూడా కేసీఆర్ ను మాట కూడా అడగడం లేదు. కారణం అడిగితే కేసీఆర్ ఎక్కడ ఓటుకు నోట్లు కేసు బయటకు తీసి జైల్లో పెడతాడని భయం. అటు కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటామని అల్టిమేటం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కారణమేమంటే బాబు రెండేళ్ల అవినీతిపై మోడీ  సీబీఐ ఎంక్వైరీ వేయిస్తాడని భయం.  అక్రమ ప్రాజెక్ట్ లపై కేసీఆర్ ను అడగడు. హోదాపై  మోడీని నిలదీయడు. చివరకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరని పరిస్థితి.  
రాజీలేని పోరాటం
రాష్ట్ర ప్రయోజనాల గురించి పోరాటం చేసేటప్పుడు కాంట్రాక్టర్ లు బలికావచ్చు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎవరి కోసమో అడుగులు వెనక్కి వేయం.  చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ది లేదు.  కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను బాబు ఎందుకు డిస్ క్వాలిఫై చేయడం లేదు.  వారిచేత ఎందుకు రాజీనామా చేయించడం లేదు. ప్రజల తీర్పు ఎందుకు కోరడం లేదు. నైతిక విలువలు మర్చిపోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దిక్కుమాలిన పరిస్థితిలో బాబు ఉన్నాడు. వారిని తీసుకొని ప్రజల దగ్గరకు పోయి ఓట్లు వేయమని అడిగే పరిస్థితిలో లేరంటే...ఆయన పాలన మీద ఆయనకే నమ్మకం లేదని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు.
అని వైయస్ జగన్ పేర్కొన్నారు.   

నవ నిర్మాణ దీక్ష లో స్పెలింగ్ మిస్టేక్ వచ్చిందా. ఏమైనట్లు

  • చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బాబు ఆర్భాటం
  • నవనిర్మాణదీక్ష కాదు నయవంచన, విధ్వంస దీక్ష
  • ఆ జీవోలపై రాజద్రోహం కేసు పెట్టాలి
  • రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బాబు విధ్వంసం చేశారు
  • చేయని వాటిని చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు
  • ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
  • బాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడుః పద్మ
హైదరాబాద్ః  చంద్రబాబు తన పాపాలు, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే... నవనిర్మాణ దీక్ష పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. అది నవనిర్మాణ దీక్ష కాదని నయవంచక, విధ్వంస దీక్ష అని పద్మ నిప్పులు చెరిగారు. రెండేళ్లలో ఏమీ చేయడం చేతగానీ ముఖ్యమంత్రి ....విభజన సమయంలో జరిగిన గాయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ  ప్రజలను రెచ్చగొడుతున్నారని  వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బాబు చేపట్టిన దీక్ష ఓ దివాలాకోరు దీక్ష అని తూర్పారబట్టారు.  బాబు విడుదల చేసిన జీవోలు 11, 66లపై  రాజద్రోహం కేసు పెట్టాలన్నారు.

నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలని చెబుతూ...ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకూడదన్న ఇంగితజ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యకరమన్నారు. మనం దేశపౌరులుగా నివసిస్తున్నాం తప్ప రాష్ట్ర పౌరులుగా కాదని పద్మ అన్నారు. దీన్ని తయారుచేసిన అధికారులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శిక్షణ తీసుకున్నారేమో అంటూ ఎద్దేవా చేశారు. పాలన గుడ్డిగా  సాగుతుందనడానికి  ప్రభుత్వం విడుదల చేసిన జీవోలే ఇందుకు నిదర్శనమని పద్మ చెప్పారు.  బాబు ఏపీని ప్రత్యేకదేశంగా భావిస్తూ, కాబోయే ప్రధాని అనుకుంటూ సింగపూర్ ,జపాన్ ల చుట్టూ తిరగడం సిగ్గుచేటని పద్మ ధ్వజమెత్తారు. 

చంద్రబాబు రాష్ట్రాన్నిరెండేళ్లలో అన్ని రకాలుగా విధ్వంసం చేశారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కారణంగా అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని... బాబు, బీజేపీతో జతగట్టి మరింతగా దగా చేశారని విరుచుకుపడ్డారు. రైతుల భూములను దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇసుకను అక్రమ వ్యాపారంగా మార్చారు.  మహిళలకు భద్రత లేని పాలన తీసుకొచ్చారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బాబు మాట్లాడడం విడ్డూరమన్నారు. ఎవరి వల్ల అన్యాయం జరిగింది చంద్రబాబు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖల మీద లేఖలు రాసింది నీవు కాదా... ? విభజనకు పార్లమెంట్ లో తొలి ఓటు వేసింది మేమే అంటూ మీ ఎంపీలు మాట్లాడలేదా..?  విభజనకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడే తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ఏర్పడిన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందన్నారు. 

మాట్లాడితే  వైయస్ జగన్ ను వేలెత్తి చూపించడం బాబుకు రివాజుగా మారిందని పద్మ ఫైరయ్యారు. మైకు ముందు సుద్దులు చెబితే తన తప్పులు ఎవరూ గుర్తించరనుకోవడం బాబు అవివేకమన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ తో మిలాఖత్ అయి చేసిన కుట్రల వల్ల వైయస్ జగన్ ను అన్యాయంగా 16 నెలల పాటు జైల్లో పెట్టారన్నారు.  బెయిల్ కూడా రాకుండా అడ్డుకురన్నారు.  బెయిల్ వచ్చినదాన్ని కూడా ఓ కుట్రగా మాట్లాడే నీచ స్థాయికి దిగజారారని పద్మ మండిపడ్డారు.  

విభజన తర్వాత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతామని మాట్లాడిన టీడీపీ, బీజేపీలు...రెండేళ్ల తర్వాత మాట్లాడుతున్న పచ్చి అబద్దాలు చూస్తే ఏపీకి ఈశాపమేందని ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు.  2019 వరకు తానుండగా  రాష్ట్రం బాగుపడదని దీక్ష ద్వారా బాబు చెప్పకనే చెబుతున్నారని పద్మ విరుచుకుపడ్డారు.  ఆ దీక్షలో కూడా జై జన్మభూమి అంటూ నినాదాలు చేసుకుంటున్నారు. మేం పరిశుద్ధులం తప్పంతా ప్రతిపక్షాలదేనని మాట్లాడుతున్నారు. అందరిచేత  ప్రతిజ్ఞ చేయిస్తున్న నీవు...ఏపీ కోసం  పలానా  మంచి చేశానని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలవా బాబు అంటూ పద్మ నిప్పులు చెరిగారు. 

ఓటుకు కోట్లు కోసం ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి, తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టారని పద్మ ధ్వజమెత్తారు. కృష్ణా,గోదావరి నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుంటే బాబు ఒక్క మాట కూడా అడిగే ధైర్యం చేయడం లేదు. వేలకు వేల కోట్ల రూపాయల స్కాములు చేస్తూ కేంద్రం వద్ద తేలు కుట్టిన దొంగల్లాగా ఉన్నారు. ఓటు కోట్లు కేసులో ఇరుక్కోవడం వల్లే చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉన్నపలంగా విజయవాడకు తట్టాబేడా సర్దాడని పద్మ ఫైరయ్యారు. బాబు నీచ రాజకీయలకు ఏపీ ప్రజలు బలైపోతున్నారని పద్మ వాపోయారు. 

ఆనాడు బాబు రాష్ట్రాన్ని విడగొట్టమంటే...సమైక్యంగా ఉంచాలని ప్రజలు పోరాడారు. ఇవాళ విభజన హామీల కోసం పోరాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ బాబే తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడుస్తున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
హోదా కోసం కట్టుబడి ఉందామని బాబు నోట మాట కూడా రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకుండా... చేయనివన్నీ చేసినట్లుగా చెప్పుకుంటూ బాబు ప్రచార ఆర్భాటం చేస్తున్నారని పద్మ మండిపడ్డారు. 

ప్రజలు ప్రతిజ్ఞ చేయాలి, ఉద్యమాలు చేయాలి. మీరు మాత్రం స్టార్ హోటళ్లలో కూర్చొని రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా బాబు అంటూ పద్మ నిప్పులు చెరిగారు. కేంద్రంతో అధికారాన్ని పంచుకుంటారు. హామీల సంగతి మాత్రం అడగరు. దీక్ష బాగా జరుగుతుందని ప్రచారం చేసుకోవడం, దానికో కోటి రూపాయలు ఖర్చు చేయడమే బాబు ఆరాటం తప్ప మరొకటి లేదని పద్మ దుయ్యబట్టారు.  సీఎం క్యాంపు కార్యాలయాలు, అద్దె భవనాలు,  ప్రత్యేక విమానాల పేరుతో వేలకోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శించారు. బాబు తాను చేసిందేమీ లేదు గనుకనే.. దీక్షలో ప్రతిపక్ష పార్టీపై గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఎన్టీఆర్ ను, ఆయన ఆశయాలను చంపేసిన చంద్రబాబు .....ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను గ్లోబెల్స్ భవన్ అని మార్చుకోవాలని హితవు పలికారు. బాబు తన ప్రచార ఆర్భాటాలు చెప్పుకోవడానికి ...ప్రజలను నడిరోడ్డున ఎండలో నిలబెట్టి గంటసేపు మాట్లాడిన తీరు దౌర్బాగ్యమన్నారు. అసలు చంద్రబాబుతోనే ప్రజలకు పెద్ద కష్టం వచ్చిందని పద్మ అన్నారు. వ్యవసాయం నాశనమైంది. కరవుతో ప్రజలు వలసలు పోతున్నారు. ఇవేమీ పట్టకుండా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను జోకొడుతున్నారు. మిగిలి ఉన్న మూడేళ్లలో ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి అబద్ధాలు చెప్పడం మాని...ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల గురించి ఆలోచన చేయాలని సూచించారు. లేకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతావని బాబును హెచ్చరించారు. 

2 June 2016

అక్కడ జనం గొంతు లో అంతటి ఆవేదన ఎందుకు

అనంతపురం: ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అనంతపురం జిల్లా లో చేస్తున్న రైతు భరోసా యాత్రలో స్థానికులతో మమేకం అయ్యారు. ఎక్కడికక్కడ ప్రజల వాణి వినేందుకు, వినిపించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పెద వడుగూరు లో ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు రైతులు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని తూర్పారబట్టారు. 


కృష్ణారెడ్డిచిన్నవడుగూరు

నాకు 11 ఎకరాల భూమి ఉంది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. రూపాయి కట్టక్కర్లేదని చెప్పారు. కానీ ఇంతవరకు 1.5 లక్ష గోల్డ్ లోన్, 75 వేల రూపాయలు క్రాప్ లోన్ ఉంది. కేవలం 8వేల రూపాయలే మాఫీ అయింది. రెండింటికీ కలిపి 56800 రూపాయల వడ్డీ అయింది. రెండేళ్ల పాటు మేం క్రాప్ లోన్, గోల్డ్ లోన్ రెన్యువల్ చేయలేదు.. చివరకు అన్నీ కోల్పోయాం. నీటి విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. వైఎస్ ఉన్నప్పుడు మా కాలవకు 1.5 టీఎంసీ కేటాయించారు. చంద్రబాబు పుణ్యాన వర్షాలు లేక, డ్యాముల్లో నీళ్లు లేక అవీ రావడం లేదు. చివరకు జేసీ బ్రదర్స్ కలిపి అన్యాయం చేస్తున్నారు. 70 రోజులు ఇస్తామన్నారు, కనీసం 50 రోజులు కూడా రావడం లేదు. జగనన్న సీఎం అయితేనే మన రైతుల సమస్యలు తీరుతాయి



మల్లయ్యముత్యాల

నాకు 4 ఎకరాల భూమి ఉంది. పంట నష్టపరిహారం ఇవ్వలేదు. బ్యాంకులో 25 వేల రుణం ఉంది. అది కూడా మాఫీకాలేదు. వడ్డీలకే సరిపోతోంది. రూపాయి కూడా రాలేదు వడ్డీ భారం కూడా పడింది. అది కూడా కలిపి కట్టమంటున్నారు. పంటబీమా కూడా రాలేదు. ఈ సంవత్సరం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వబోమని అంటున్నారు. పబ్లిగ్గా బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు.. చంద్రబాబుకు ఏం చెబుతాం.


రామచంద్రరాజుమేడిమాకులపల్లె

నాకు 8 ఎకరాల భూమి ఉంది. గోల్డ్ లోన్ 80 వేలు, క్రాప్ లోన్ 80 వేలు ఉంది. అందులో 12వేలు పోయిందన్నారు. మళ్లీ 8వేలు ఎదురు వడ్డీ కట్టాం. 2 రూపాయల వడ్డీ కట్టుకుంటున్నామన్నారు. ఆ పొద్దు ఆయన కట్టొద్దని అన్నారు కాబట్టి కట్టలేదు. ఇప్పుడు వాళ్ల పుణ్యాన అధిక వడ్డీ కట్టాల్సి వస్తోంది. బంగారం వేలం వేస్తామని నోటీసులు వస్తే భూములు తాకట్టు పెట్టి బంగారం విడిపించుకున్నాం. రైతుకు చక్రవడ్డీ పడుతోంది. పంటబీమా రూపాయి కూడా రాలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ రాదన్నారు. విత్తనాలు కూడా మొలకెత్తడం లేదు. ఈయనొస్తే మళ్లీ వర్షాలు రావు. మేం బతికుంటే మళ్లీ ఆయనకు మాత్రం ఓటు వేయం.



చంద్రావతిడ్వాక్రా మహిళ

 మా గ్రూపులో 15 మంది ఉన్నాం. 5 లక్షల రుణం తీసున్నాం. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెబితే టీడీపీకి ఓట్లు వేశాం. చంద్రబాబు చెప్పినందుకు అప్పుకట్టలేదు. అయితే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మూడు నెలలకే 30 వేల వడ్డి వచ్చింది.


అద్భుతంగా డబ్బు సంపాదించటం ఎలా.. టాప్ వన్ సీక్రెట్

  • ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చిన పాపాన పోలేదు
  • ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు
  • అన్నీ నారాయణార్పితం చేస్తున్నారు
  • నయవంచనకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలిఃతమ్మినేని సీతారాం
హైదరాబాద్ః రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు నవనిర్మాణ దీక్ష కోసం జీవోను విడుదల చేయడం విడ్డూరమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు. నయవంచనకు నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు నాయుడని సీతారం ఫైరయ్యారు. చంద్రబాబు ఏం సాధించారని నవనిర్మాణ దీక్ష చేపడుతున్నారని తమ్మినేని నిలదీశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు వందలాది ఫ్రీ వాగ్ధానాలు చేసిన ఆల్ ఫ్రీ బాబు...అన్ని వర్గాల ప్రజలను నయవంచన చేసి నవనిర్మాణ దీక్ష చేపడుతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తమ్మినేని సీతారాం మాట్లాడారు. 

కోస్టల్ బెల్ట్ లో ల్యాండ్ బ్యాంక్ పేరుతో రైతుల మీద లాఠీ ఛార్జ్ చేసి 10 లక్షల ఎకరాలు లాక్కున్నదానికి ఏ దీక్ష పేరు పెట్టాలి బాబు..? రాజధానిలో రైతుల భూములు మీ అబ్బ జాగీరులుగా దోచుకున్న దానికి ఏమని పేరు పెట్టాలి...? సాండ్ మాఫియాలో కోట్లాది రూపాయలు లోకేష్ కు దోచిపెట్టినదాన్ని ఏ దీక్ష అనాలి...? ల్యాండ్,  లిక్కర్ మాఫియాల దోపిడీని ఏ దీక్షల కింద పెడతారు..? ఉపాధి హామీ పథకాన్ని డైవర్ట్ చేసి నీరు చెట్టు పేరుతో పసుపుచొక్కాలకు పందికొక్కుల్లా తినమని దోచిపెడుతున్నారే దాన్ని ఏ దీక్ష కింద చూపిస్తారు..? బాబు అంటూ తమ్మినేని విమర్శలు గుప్పించారు. ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని చంద్రబాబుపై తమ్మినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

నవనిర్మాణ దీక్ష అనుకోవాలా, నయవంచన దీక్ష అనుకోవాలా బాబు అంటూ తమ్మినేని విరుచుకుపడ్డారు. ఎయిర్ పోర్ట్ లు, సీ పోర్ట్ లు,  స్మార్ట్ సిటీలు అన్నావ్ . అవి ఎక్కడున్నాయి బాబు. ఏ ప్రాంతమెళితే  అక్కడ  మలేషియా చేస్తా, సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తానంటూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని తమ్మినేని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలని బాబు చిదంబరానికి లేఖల మీద లేఖలు రాశారు. రోశయ్య హయాంలో ఆల్ పార్టీ మీటింగ్ లో విభజనకు ఆమోదముద్ర వేసింది వాస్తవం కాదా బాబు..! ఓటింగ్ తర్వాత అప్పటి మీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు బయటకు వచ్చి విభజనకు తొలివోటు వేసింది తెలుగుదేశమేనని చెప్పింది వాస్తవం కాదా .! దీన్ని ఖండించే ధైర్యం ఉందా..! ఆనాడు విభజనకు అంగీకరిస్తున్నామని చెప్పి ఈరోజు అన్యాయమని బాబు చెప్పడం ఇంకా ప్రజలను వంచించడమేనని తమ్మినేని దుయ్యబట్టారు. కేంద్రంలో బలం లేకపోయినా వైయస్ జగన్ విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్లకార్డు ప్రదర్శించిన విషయాన్ని తమ్మినేని గుర్తు చేశారు. 

చేసిన తప్పిదాలను నిస్సిగ్గుగా కప్పిపెట్టడమే బాబు నైజమని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలు కలిసి విభజన చట్టంలోని అంశాలను తుంగలో తొక్కాయన్నారు. రాజ్యసభలో  ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ వెంకయ్యనాయుడు , కాదు పదిహేను ఇవ్వాలని తిరుపతి సాక్షిగా చంద్రబాబు నాయుడు అన్న మాటలను తమ్మినేని ఈసందర్భంగా మరోసారి గుర్తు చేశారు. ఆ హోదా కోసం పోరాడకుండా.... చంద్రబాబు ఓటుకు నోటు కేసులో తాళం వేసుకొని  ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాను తుంగలో తొక్కారు. రైల్వే జోన్ ను పక్కనబెట్టారు.  కృష్ణా, గోదావరి నదీ జలాలను తెలంగాణ సర్కార్ తోడుకుపోతుంటే, రాష్ట్ర హక్కులను లాక్కెలుతుంటే తాకట్టు పెట్టే మీ నైజం నయవంచన గాక మరేమంటారు బాబు అని తమ్మినేని మండిపడ్డారు. 

రుణాలు మాఫీ అన్నారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులకు మాఫీ చేశారో చెప్పగలరా బాబు..? రైతులు బ్యాంకు గడప తొక్కకుండా చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. పైసా చెల్లించలేదు. ఇది నయవంచన కాదా చంద్రబాబు. ప్రతి వర్గానికి హామీలిచ్చారు. జాబు రావాలంటే బాబు రావాలని కరపత్రాలు వేయించి ఇంటింటికి పంపించారు. జాబులెక్కడ బాబు. విద్యార్థులు, నిరుద్యోగులను నయవంచన చేశారు. పాఠశాలలను మూసేస్తున్నారు. అన్నీ నారాయణార్పితం చేస్తున్నారు. దీన్నేమంటారు బాబు నయవంచన గాక. టీచర్లను గ్రామాల్లోకి పంపినా పిల్లలు ప్రభుత్వ బడులకు రావడం లేదంటూ ఓ సాకుతో ప్రభుత్వ స్కూళ్లను  ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు. దీన్ని నారాయణ వంచన అనాలా నారావంచన అనాలా అంటూ తమ్మినేని ఫైరయ్యారు.  

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో బాబు మీటింగ్ లు చూసి జనం నవ్వుకుంటున్నారని తమ్మినేని సీతారం ఎద్దేవా చేశారు. విలువలను పాతరేసి నడిరోడ్డున నిలబెట్టిన ఫిరాయింపు శాసనసభ్యులు ....చంద్రబాబు విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. విలువల గురించి మాట్లాడే అర్హత  పార్టీ మారిన ఎమ్మెల్యేలు కోల్పాయారని తమ్మినేని దుయ్యబట్టారు. జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి ల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని తమ్మినేని అన్నారు. వారి మాటలతో విలువల తల్లి సిగ్గుతో తలదించుకుంటోందని ఎద్దేవా చేశారు. 

జ్యోతుల నెహ్రూ నీవు  చెబితే  బాబు ఐదు ప్రాజెక్ట్ లు ఇచ్చాడా . లేకపోతే ఆ జిల్లా ప్రజలు సంకనాకిపోవాలా. ముఖ్యమంత్రిగా పరిరక్షించాల్సిన బాధ్యత బాబుకు లేదా. ప్రజలను మభ్యపెట్టి జీవోలివ్వడం సరైంది కాదు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులంతా  రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడితే బాగుంటుందని తమ్మినేని హితవు పలికారు. వైయస్ జగన్ పక్కన కూర్చోనివ్వలేదంటూ  ఏపీ ప్రజల కళ్లకు గంతలు కట్టేవిధానం మానుకోవాలని జ్యోతుల, భూమాలను హెచ్చరించారు. చంద్రబాబు ఎలాంటి వాడో అందరికీ తెలుసునన్నారు. మీరు మాట్లాడే విధానం సరైంది కాదని మీ అంతరాత్మ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుందన్నారు. 

1 June 2016

చంద్రబాబు హామీలు అంతే సంగతులు..!

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు అంటేనే నీటి మూటలు అనుకోవాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వ రికార్డులు కూడా అదే విషయాన్ని బయట పెట్టాయి.
          ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారం చేపట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు పక్కా ఇల్లు. ప్రత్యేక హోదా అనేవి ప్రధానంగా ఆయన ఇచ్చిన హామీలు. వాటిని అలాగే గాలికి వదిలేశారు.
          అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తీరు మారలేదు. అవే అబద్దాలు, అవే మోసాలు కొనసాగిస్తూ వచ్చారు. ప్రతీ చోట ప్రజల్ని ముంచేందుకు రక రకాల గిమ్మిక్కులు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఇస్తున్న హామీలు, వాగ్దానాల మీద ప్రభుత్వం రికార్డుల్లో నమోదు చేస్తూ వచ్చింది. తాజాగా కలెక్టర్ల సదస్సులో భాగంగా ఎక్కడెక్కడ చంద్రబాబు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు అనే వివరాలు బయటకు వచ్చాయి. జిల్లాల వారీగా లెక్కలు వెలుగు చూశాయి.
          ఏడాది కాలంలో చంద్రబాబు 681 హామీలు ఇచ్చినట్లు లెక్క తేలింది. పనులు చేసి అమలు చేసినవి 112 గా లెక్క తేల్చారు. వాస్తవానికి ఈ 112 పనులు కూడా అర కొర పనుల బాగోతమే అని ప్రజలు అనుకొంటున్నారు. అయినప్పటికీ  ఆ పనులు పూర్తయ్యాయి అనుకొన్నప్పటికీ 16.45 శాతం మాత్రమే హామీలు అమలు అయినట్లు. మిగిలిన 83శాతం హామీలు నీటి మూటలే అని తేలింది. ఇదీ చంద్రబాబు పాలన.