30 July 2015

ప్రత్యేక హోదా కోసం 10న ఢిల్లీలో ధర్నా

వైఎస్‌ఆర్‌సీపీ  అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డివెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోవైఎస్ జగన్ సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా వారితో చర్చించారు.  అలాగే ఏపీలో కరువు, రైతుల ఆత్మహత్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఇబ్బందులపై పార్టీ నేతలతో చర్చించారు.  అనంతరం ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా ఉంటుందన్నారు.  ఆ తర్వాత ‘మార్చ్ టు పార్లమెంట్’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 

29 July 2015

రిషితేశ్వ‌రి మ‌ర‌ణాన్ని అట‌క ఎక్కిస్తారా..!

ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యంలో అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయిన రిషితేశ్వ‌రి మ‌ర‌ణంపై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఈ మేర‌కు ఆయ‌న సామాజిక వెబ్ సైట్ ట్విట‌ర్ లో ట్వీట్ చేశారు. రిషితేశ్వ‌రి రాసిన లేఖ ఉన్న‌ప్ప‌టికీ, ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులు అయిన వారిపై ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య తీసుకోకుండా అట‌క ఎక్కించటం బాధాక‌ర‌మ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌మాజంలో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, భ‌యం భ‌యంగా బ‌త‌కాల్సిందేనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ భ‌య‌మే ప్ర‌భుత్వ సందేశ‌మా అని జ‌గ‌న్ నిల‌దీశారు. మ‌న నాగ‌రిక స‌మాజానికి, మ‌న భ‌విష్య‌త్ త‌రాల వారికి, మ‌న త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న సందేశం భ‌య‌మేనా..! అని ఆయ‌న అన్నారు. ఈ ఉదంతంలో చాలా స్ప‌ష్టంగా సూసైడ్ నోట్ (ఆత్మ‌హ‌త్య లేఖ‌) ఉన్న‌ప్ప‌టికీ, దీన్ని కోల్డ్ స్టోరేజ్ కు పంపించటం బాధాక‌రం...దుఃఖ‌క‌రం అని వైఎస్ జ‌గ‌న్ అన్నారు.

28 July 2015

క‌లాంగారి మ‌ర‌ణ వార్త క‌న్నీటి స‌ముద్రంలో ముంచింది: వైఎస్ జ‌గ‌న్‌

మాజీ రాష్ట్ర‌ప‌తి, భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ డాక్ట‌ర్ అబ్దుల్ క‌లాం గారి మ‌ర‌ణ వార్త న‌న్ను క‌న్నీటి స‌ముద్రంలో ముంచింది. అలాంటి మ‌హానుభావులు యుగానికొక‌రు మాత్ర‌మే క‌నిపిస్తారు. వ్య‌క్తిగా ఆయ‌న వంద‌ల కోట్ల మందికి ఆత్మీయుడు, ఆరాధ్యుడు. ఈ దేశంలోని ప్ర‌తీ ఒక్క‌రికీ ఆయ‌న అర‌మ‌రిక‌లు లేకుండా క‌లిసిపోయే మ‌న ఇంటి మ‌నిషి లాంటి వాడు. మ‌న దేశాన్ని అంత‌రిక్ష‌, క్షిప‌ణి విజ్ఞానాల్లో మ‌హోన్న‌త స్థానంలో నిలిపిన మ‌హా శాస్త్ర‌జ్ఞుడు, దేశ భ‌క్తుడు, నిరాడంబ‌రుడు, నిలువెత్తు నిస్వార్థ ప‌రుడు, జ్ఞానాన్ని పంచుతూ చివ‌రి క్ష‌ణాల‌ను కూడా జాతికి అంకితం చేసిన మ‌హా మ‌నీషి అబ్దుల్ క‌లాం గారు. అట్ట‌డుగు స్థాయిలోని మ‌త్స్య‌కార కుటుంబంలో పుట్టి, పేప‌ర్ బాయ్ గా ప‌ని చేసి..రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి వ‌ర‌కు ఎదిగి, ఆ ప‌ద‌వి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఉపాధ్యాయుడిగా మారిన క‌లాంగారి జీవితంలో ప్ర‌తీ అడుగు, ప్ర‌తీ అణువు సందేశాత్మ‌కం, స్ఫూర్తి దాయ‌కం. 84 ఏళ్ల వ‌య‌స్సులో కూడా భార‌త జాతిని త‌రువాతి త‌రం శాస్త్ర సాంకేతిక‌త‌కు స‌మాయ‌త్తం చేస్తూ, మ‌హోపాద్యాయుడిగా స్ఫూర్తి నింపుతూ, జ్ఞానాన్ని పంచుతూ మ‌ర‌ణించారాయ‌న‌. రాష్ట్రప‌తి అయినా సామాన్యుడిగానే బ‌తికారు. ఆ ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌రువాత ఎవ‌రికీ ద‌క్క‌నంత గౌర‌వాన్ని పొందారు. ఈ మ‌హ‌నీయుడు భార‌తీయ ఆత్మ‌కు అస‌లు సిస‌లు ప్ర‌తీక‌. భౌతికంగా మ‌న‌ల్ని వ‌దిలిపోయిన  ఆ మ‌హ‌నీయుడికి శిర‌సు వంచి అభివాదం చేస్తున్నాను. 
- వైఎస్ జ‌గ‌న్‌

బాబు నమ్మినందుకు పరువు పోయింది

 కుమిలిపోతున్న అన్నదాతలు
 ---------------------------
 పత్రికల్లో రోజూ వేలం ప్రకటనలు
 మూడేళ్లు దాటిన బంగారు నగలు వేలం
 తలెత్తుకోలేకపోతున్నామని రైతుల వేదన
 అధికవడ్డీకి తెచ్చి నగలు విడిపించుకుంటున్న వైనం
 మరలా అవి తాకట్టుపెట్టినా పరిమితంగానే రుణం
 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో అన్నదాత తిప్పలు
 రుణమాఫీని నమ్ముకున్నందుకే ఈ దుస్థితి
 బాబును నమ్మినందుకు నట్టేట్లో ముంచారంటున్న రైతులు
 --------------------------------

 చంద్రబాబు నాయుడును నమ్ముకున్నందుకు పరువు పోయిందని అన్నదాతలు కుమిలిపోతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. అందులో రైతు రుణమాఫీ ఒకటి. రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా కాలం ఆ హామీని అటకెక్కించారు. ప్రతిపక్షం పోరు పడలేక చివరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించారు. అయితే అందులో ఎన్నో కొర్రీలు. లబ్దిదారులను పరిమితం చేశారు. మాఫీ మొత్తాన్నీ మాయచేశారు. రుణమాఫీ పథకాన్ని నమ్ముకున్నందుకు చంద్రబాబు తమ పరువును నడిబజార్లో నిలిపారని రైతులు వాపోతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకుల్లో కుదువపెట్టిన బంగారు నగల వేలానికి సన్నాహాలు జరుగుతుండడంతో రైతులు పరువు పోతోందని భయపడుతున్నారు.

 పత్రికలలో వేలం ప్రకటనలు
 బకాయిదారులుగా రైతుల పేర్లను బ్యాంకులు వివిధ పేపర్లలో ప్రకటనలిస్తున్నాయి. తమ పేర్లు పత్రికల్లో ఎక్కడాన్ని అవమానంగా భావిస్తున్న రైతులు ప్రభుత్వ నిర్వాకంపై మండిపడుతున్నారు.  చిత్తూరు జిల్లా వరదాయపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచికి సంబంధించి 241 మంది రైతుల పేర్లతో బంగారు నగల వేలం ప్రకటన పత్రికలలో ప్రచురితమయ్యింది.అంతకుముందు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నారాయణవనం బ్రాంచి కూడా 294 మంది పేర్లతో ఇలాంటి ప్రకటనే ఇచ్చింది. ఇలాంటి ప్రకటనలు రాయలసీమ జిల్లాల్లో ప్రతి రోజూ పత్రికలలో వస్తూనే ఉన్నాయి. ఫలానా తేదీలోపు అప్పు చెల్లించకపోతే నగలు వేలం వేస్తామని ఆ ప్రకటనలలో స్పష్టంగా ఉంటోంది.

 బాబు మాటలు నమ్మి...
 తెలుగుదేశం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు రుణమాఫీపై ఎన్నికల ముందు ఎన్నో సభల్లో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రముఖంగా ప్రస్తావించారు. దాంతో రైతులు పంట రుణాలను చెల్లించడం ఆపేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రునమాఫీకి సవాలక్ష ఆంక్షలు విధించారు. బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని, తామే బ్యాంకులకు చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. తొలిదశలో నామమాత్రంగా చెల్లించి మిగిలింది తర్వాత ఇస్తామని ప్రకటించారు. అయితే బ్యాంకులు మాత్రం ప్రభుత్వం కోసం ఆగడం లేదు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటిన రుణ ఖాతాలలోని బంగారు నగలను వేలం వేస్తున్నాయి. 2013 మార్చి వరకు తీసుకున్న రుణాలకు సంబంధించిన నగలను వేలం వేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి. దీంతో ైరె తులు తీవ్ర ఆందోళనలో మునిగిపోతున్నారు. పరువు పోతోందని బాధపడుతున్నారు.

 పరువుపోతోందని విడిపించుకుంటున్నారు..
 సామాన్యంగా రైతులు చాలా అభిమానవంతులు. నలుగురికీ అన్నంపెట్టే రైతన్న పరువు కోసం ప్రాణమైనా ఇవ్వాలనుకుంటారు. చంద్రబాబును నమ్ముకుంటే తమ పరువును బజారుకు ఈడ్చాడని, ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని రైతన్నలు వాపోతున్నారు. బ్యాంకుల వేలం ప్రకటనలు చూసిన కొందరు రైతులు ఎక్కువ వడ్డీకి అందిన చోటల్లా అప్పులు తెచ్చి బంగారు నగలు విడిపించుకుంటున్నారు. నగల కోసం కాదని, పరువు పోతోందని విడిపించుకుంటున్నామని రైతులంటున్నారు. పంట ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం తెచ్చుకున్న డబ్బును ఇప్పుడు బ్యాంకుల్లో నగలు విడిపించడానికి చెల్లిస్తున్నామని, అసలు, వడ్డీ కలసి తడిసి మోపెడయ్యాయని రైతులు భోరుమంటున్నారు.

 కొత్తరుణాలు పుట్టడం లేదు...
 అప్పుచేసి ఎలాగోలా విడిపించుకున్న నగలను మరలా తాకట్టు పెట్టి రుణం తీసుకుందామంటే కుదరడం లేదు. చంద్రబాబు మాఫీ మోసం వల్ల రైతులు ఇపుడు కొత్త రుణాలకు అనర్హులుగా మారిపోయారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కచ్చితంగా పాటించాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. గతంలో రైతులకు ఉదారంగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు ఇపుడు రుణమాఫీ నిబంధనలు, ఆంక్షలతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. అందుకే విడిపించుకున్న నగలను మరలా తాకట్టు పెట్టడానికి రైతులు సిద్ధమైనా ఆ బంగారానికి పరిమితంగానే రుణం వస్తోంది. పంటను బట్టి నింబధనలను బట్టి పరిమితంగా రుణం ఇస్తున్నామని, అనవసరమైన రిస్క్ తీసుకోదలచుకోలేదని బ్యాంకు అధికారులంటున్నారు.  ఇపుడు ఏ బ్యాంకులోనైనా ఇదే పరిస్థితి. రైతులకు అప్పులు పుట్టని దుస్థితి. ఒకప్పుడు గౌరవంగా బతికిన తమకు చంద్రబాబు వల్లే ఈ దురవస్థ దాపురించిందని రైతులు వాపోతున్నారు.

ముల్లుకర్రతో పొడిస్తేనే కదులుతున్న బాబు!

 జగన్ ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం
 తోలుమందం సర్కారుతో జనం సతమతం

 జగన్ మూడోవిడత భరోసాయాత్రకు బయల్దేరితేనే రు.692 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
 జగన్ అల్టిమేటమ్ జారీ చేస్తేనే మునిసిపల్ కార్మికుల డిమాండ్లకు పరిష్కారం
 జగన్ భరోసాయాత్రకు దిగితేనే ఆత్మహత్యలను గుర్తించి పరిహారం ప్రకటన
 జగన్ జోక్యం చేసుకుని బహిరంగ లేఖ రాస్తేనే ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్ బెనిఫిట్
 జగన్ తణుకు దీక్ష చేపడితేనే తొలివిడత రైతు రుణమాఫీ నిధుల విడుదల
 జగన్ మంగళగిరి సమరదీక్షకు దిగితేనే డ్వాక్రా మహిళలకు రు.3వేల చెల్లింపు
 జగన్ గట్టిగా నిలదీస్తేనే అసెంబ్లీ సమావేశాల ముందు కరువు మండలాల ప్రకటన

  ఆంధ్రప్రదేశ్‌లో అరాచకత్వం రాజ్యమేలుతోంది. అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజా సమస్యల విషయంలో చొరవచూపించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించి ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంటోంది. సమస్యలు తీర్కండి మహాప్రభో అని ప్రజలు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ఎన్నికల అవసరం తీరిపోగానే మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశాడు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ముఖ్యమైన హామీలను తుంగలో తొక్కాడు. అరకొర రుణమాఫీ, అనేక షరతుల మాయాజాలంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాతరుణాలు తీరిస్తేనే కొత్తరుణాలిస్తామని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి. మోసపోయామని తెలిసి ఇపుడు రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉసూరుమంటున్నారు. కొత్త ఉద్యోగాలివ్వక పోగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్న బాబుపై జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక రోజుకో కొత్త సమస్యను సృష్టిస్తూ, త్రిశంకు రాజధాని ఊహలలో తేలిపోతూ ఆకాశంలో తప్ప కింద తిరగడానికి ఇష్టపడని చంద్రబాబును భూమార్గం పట్టించి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా మళ్లించడానికి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అహరహం పోరాడాల్సి వస్తున్నది. ముల్లుగర్రతో పొడిస్తే గానీ దున్నపోతు మాట వినదన్నట్లుగా ప్రతి అంశం లోనూ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడితే గానీ పనులు జరగడం లేదు. జగన్ అల్టిమేటమ్ జారీ చేస్తేనే చంద్రబాబు ప్రభుత్వం కదులుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు దిగితేనే బాబు సర్కారు జనం సమస్యలపై దృష్టి సారిస్తోంది. అలాంటి కొన్ని ఉదాహరణలు చూద్దాం...

 జగన్  మూడో విడత భరోసాయాత్ర ఆరంభం
 692 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరు
  ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులకు అవసరమైన అన్ని అవసరాలను రాష్ర్ట ప్రభుత్వం దగ్గరుండి చూసుకోవాలి. అన్నదాతకు అవసరమైన అన్ని అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలి. అందులోనూ కరువు పీడిత ప్రాంతాలంటే వాటి కష్టాలే వేరు. ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు ఓటుకు కోట్లు, పట్టిసీమ కమీషన్లు వంటి ‘అతి ముఖ్యమైన’ లావాదేవీల్లో కూరుకుపోయారాయె. ఇక పత్తిపాటి పుల్లారావు వంటి వ్యవసాయ శాఖామాత్యులకూ రాజధాని రియల్‌ఎస్టేట్ వ్యవహారాలలో తలమునకలుగా ఉన్నారు. వారికీ తీరుబడి కావడం లేదు. దాంతో జగన్ రంగంలోకి దిగారు. ఈనెల 21న మూడో విడత భరోసాయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతపురం రైతు ఆత్మహత్యలతో పాటు రైతుల సమస్యలపై జగన్ నిలదీస్తుండడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. కరువు పీడిత ప్రాంతాలకు రు.692 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీని విడుదల చేస్తూ జులై 22న జీవో జారీ చేసింది.

 జగన్ అల్టిమేటమ్
 మునిసిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కారం
 మునిసిపల్ కార్మికులు, ఉద్యోగులు రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు. పురపాలక సంఘాలలో చెత్త పేరుకుపోయింది. వ్యాధులు ప్రబలుతున్నాయి. అయినా ఈ సర్కారు మొద్దు నిద్ర వీడలేదు. మంత్రిమండలి సమావేశంలో సమ్మెను అణచేయడానికి పథకాలు రచించారు. కార్మికులపై బెదిరింపులకు దిగారు. కచ్చితంగా నాలుగురోజుల్లో మునిసిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకపోతే రాష్ర్ట బంద్‌కు పిలుపునిస్తానని, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని జగన్ అల్టిమేటమ్ జారీ చేశారు. అనంతపురంలో జగన్ ఈనెల 23న ప్రకటించగానే 25న రాష్ర్టప్రభుత్వం కార్మికసంఘాలతో చర్చలు జరిపింది. వారి వేతనాన్ని పెంచి సమ్మెను విరమింపజేసింది. కార్మిక సంఘాల జేఏసీ నేతలు జగన్‌ను కలుసుకుని మిఠాయిలు తినిపించారు. జగన్ చొరవచూపించబట్టే తమ సమస్యలు పరిష్కారమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.

 రైతు భరోసాయాత్రకు జగన్ శ్రీకారం
 ఆత్మహత్యలను గుర్తించిన ప్రభుత్వం.. ఐదులక్షల పరిహారం
 అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలపై జగన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు సర్కారుకు విజ్ఞప్తి చేశారు. అయితే రైతుల ఆత్మహత్యలే లేవని, తమ ఏలుబడిలో రైతులు సంతోషంతో ఉన్నారని, సంబరాలు చేసుకుంటున్నారని చంద్రబాబు వాదించారు. అనంతపురం వెళ్దాం రండి ఆత్మహత్యలు ఉన్నాయో లేవో చూపిస్తాను అని జగన్ సవాల్ విసిరారు. అంతేకాదు రైతు భరోసా యాత్ర చేపడతానని ప్రకటించారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చింది. అనంతపురం జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నివేదిక ఇచ్చింది. వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.

 జగన్ బహిరంగ లేఖ
 ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం
 తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే తమకూ ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఉండాలన్న ప్రధాన డిమాండ్‌తో వారు సమ్మెను ఉధృతం చేశారు. ప్రజారవాణా స్తంభించి పోయింది. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కానీ చంద్రబాబు సర్కారుకు మాత్రం అవేవీ కనిపించలేదు. ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని, సమ్మెలో ఉన్న ఉద్యోగులను డిస్మిస్ చేసి ఇంటికి పంపించేస్తామని హూంకరింపులకు దిగారు. అంతేకాదు శిక్షణలేని ప్రయివేటు డ్రయివర్లతో వాహనాలను నడిపి అనేక ప్రమాదాలకు కారణమయ్యారు. దాంతో మే 9న రెండు తెలుగు ప్రభుత్వాలకు జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటమ్ ఇస్తూ బహిరంగ లేఖరాశారు. రెండు ప్రభుత్వాలు చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు 44శాతం, ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులకు 43శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ దక్కింది.

 దీక్షకు సిద్ధమైన జగన్
 తొలివిడత రుణమాఫీ నిధులు విడుదల
 అలవికాని హామీలతో రైతులను, మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు పదవి చేపట్టిన తర్వాత రుణమాఫీపై ఎన్నో నాటకాలాడారు. రిజర్వు బ్యాంకును, కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పంతా వారిదే అయినట్లు ప్రజల దృష్టిని మళ్లించాలని చూశారు. అసెంబ్లీలోనూ, వెలుపలా జగన్‌మోహన్‌రెడ్డి నిలదీస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో రుణమాఫీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే అనేక షరతులు విధించి రుణమాఫీ లబ్దిదారులను కుదించేశారు. రుణమాఫీ మూడువిడతల్లో చేస్తామని, ఒకసారి, బాండ్లు ఇస్తామని మరోసారి మోసగిస్తూవచ్చారు. దాంతో జనవరి 31, ఫిబ్రవరి 1న తణుకులో రైతు దీక్ష చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో తొలివిడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 సమరదీక్షకు జగన్ సన్నద్ధం
 డ్వాక్రా మహిళలకు మూడువేలు విడుదల
 రైతులను మోసగించినట్లే చంద్రబాబు నాయుడు డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా మోసగించారు. బేషరతుగా డ్వాక్రా రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు పదవినధిష్టించగానే దానిని అటకెక్కించారు. డ్వాక్రా రుణాల మాఫీపై అసెంబ్లీలో గట్టిగా నిలదీసిన జగన్‌మోహన్‌రెడ్డి వెలుపల ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఆందోళనలు చేస్తున్న డ్వాక్రా మహిళలకు పార్టీ శ్రేణులు గట్టిగా మద్దతిచ్చాయి. చివరకు ఒక్కో మహిళకు రు.10 వేల చొప్పున మాఫీ చేస్తామని, సంఘంలో పదిమంది మహిళలు ఉంటే మొత్తానికి లక్ష రూపాయలు మాఫీ అవుతాయని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ పదివేలను కూడా మూడు విడతలుగా ఇస్తామని చెప్పారు. కానీ ఆ మూడువేలను విదిల్చడానికి కూడా మీనమేషాలు లెక్కించారు. చంద్రబాబు ఏడాది పాలనలో చేసిన మోసాలపై మంగళగిరిలో సమరదీక్ష చేస్తున్నట్లు జగన్ ప్రకటించగానే హడావిడిగా డ్వాక్రా సంఘాలకు తొలివిడత మూడువేలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 కరువుమండలాలపై నిలదీసిన జగన్
 అసెంబ్లీ సమావేశాల ముందు కరువు మండలాల ప్రకటన
 రాష్ర్టంలో ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. అనేక సమస్యలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారికి సకాలంలో అందించాల్సిన సహాయంపై చంద్రబాబు ఎప్పుడూ స్పందించిందే లేదు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను, మండలాలను గుర్తిస్తే ఆయా ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగానికి వీలవుతుంది. అలా కరువు మండలాలు ఏవి అనే దానిపై అధికారులు అనేక నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తారు. ఆ మండలాలను నిర్ణయించి ఆ విషయాన్ని ప్రకటించడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి తీరలేదు. కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించడంతో ఆ విషయం అసెంబ్లీలో రచ్చ అవుతుందనే భయంతో అసెంబ్లీ సమావేశాల ముందు రోజు రాత్రి హడావిడిగా కరువు మండలాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది.

25 July 2015

ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబుది ప్రచారం ఆర్భాటమే..!


 అనంతపురం: ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ప్రచార ఆర్భాటం మాత్రమేనని, ఏమాత్రం చిత్త శుద్ధి లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండి పడ్డారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా ఐదో రోజు పి. కొత్త పల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హంద్రీ నీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రచార ఆర్భాటాన్ని ప్రద ర్శిస్తున్నారని మండిపడ్డారు. దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనుల్లో దాదాపు 85 శాతం దాకా పూర్తి అయ్యాయని వివరించారు. ఇంకా మిగిలిన పనులకు చంద్రబాబు అర కొరా నిధుల్ని ఇస్తున్నారని పేర్కొన్నారు. తీరా చేసి, హంద్రీ నీవా ను పూర్తి చేసిన ఘనత తనదే అంటూ ప్రచారం చేసుకొంటున్నారని జగన్ అన్నారు.
  రుణ మాఫీ పేరుతో చంద్రబాబు రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారని మండి పడ్డారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగుల్ని వంచించారని వివరించారు. ఏడాది గడిచిపోయినా, అసలు ఈ హామీల ఊసే ఎత్తటం లేదని జగన్ అన్నారు. ఒక్క కొత్త ఇల్లు ఇవ్వలేదని, పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు అందటం లేదని ఆయన అన్నారు. కరవు తట్టుకోలేక రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. ఒక వైపు ఇంతటి సంక్షోభం నెలకొంటే, చంద్రబాబు మాత్రం అబద్దాలతో కాలక్షేపం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలే లేవని, తమ పాలనలో సుఖ శాంతులతో ఉన్నారని చెప్పటం సిగ్గు చేటని అభివర్ణించారు.
  అనంతపురం జిల్లా లో కరవు తాండవిస్తోందని, రైతాంగం కష్టాలు పడుతోందని జగన్ వెల్లడించారు. ఇంతటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే రైతులు బెంగళూరుకి వలస వెళుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ వస్తుందంటే మాత్రం వచ్చి పరిహారం చెల్లిస్తారని, లేదంటే మాత్రం పట్టించుకోరని వివరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఈ దేశంలో ఉంటారో.. ఎప్పుడు విదేశాల్లో ఉంటారో తెలియదని జగన్ వ్యాఖ్యానించారు. 

24 July 2015

బాబు జ‌మానాలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు!

చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చాక మ‌హిళ‌ల‌కు పూర్తిగా ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని వైఎస్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా విమ‌ర్శించారు. తిరుప‌తిలో విలేక‌రుల‌తో మాట్లాడారు. కృష్ణాజిల్లాలో మ‌హిళా త‌హ‌సిల్దార్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించి దాడికి పాల్ప‌డితే త‌హ‌సీల్దార్‌దే త‌ప్ప‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు కేటాయించిన ఇసుక రీచ్‌ల వ‌ద్ద ఎమ్మెల్యేలు, స‌ర్పంచ్‌ల‌కు ప‌నేమిట‌ని ఆమె ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల పేరుతో అధికార‌పార్టీ నాయ‌కులే ఇసుక దందాకు పాల్ప‌డుతున్నార‌ని రోజా వ్యాఖ్యానించారు. ఇసుక‌ను అక్ర‌మంగా త‌ర‌లించుకుపోతున్న ఎమ్మెల్యే చింత‌మ‌నేనిని అడ్డుకున్న మ‌హిలా త‌హ‌సీల్దార్ వ‌న‌జాక్షిపై దాడికి పాల్ప‌డినా ఇంత వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోకుండా ఐఎఎస్ అధికారితో క‌మిటీ వేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఏ అధికారితోనైనా క‌మిటీ వేసి నివేదిక ఇవ్వ‌మంటే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఇస్తారా అని రోజా ప్ర‌శ్నించారు. చిత్తూరు జిలా్ల చిన్న గొట్టిగ‌ల్లు మండ‌లంలో ఎస్సీ మ‌హిళా త‌హ‌సీల్దార్ నారాయ‌ణ‌మ్మ‌పై టీడీపీకి చెందిన స‌ర్పంచ్ దాడికి పాల్ప‌డినా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని రోజా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా మ‌హిళ‌ల‌పై యాసిడ్ దాడులు, విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయ‌ని రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మాస్ట‌ర్ ప్లాన్ కాదు.. వ్యాపార ప్లాన్‌!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణానికి మాస్ట‌ర్‌ప్లాన్ రూపొందించామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని, కానీ వాస్త‌వానికి అది వ్యాపార ప్లాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు విమ‌ర్శించారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ చంద్ర‌బాబు ప‌ద‌వి న‌ధిష్టించిన‌పుడే సింగ‌పూర్ ప్ర‌యివేటు సంస్థ‌ల‌తో రాజ‌ధానిపై ఒప్పందాలు కుదుర్చుకున్నార‌ని అన్నారు. లావాదేవీల‌కు సంబంధించిన అంశాల‌పై ఆయ‌న సింగ‌పూర్ కంపెనీల‌తో ఎప్పుడో మాట్లాడేసుకున్నాడ‌ని చెప్పారు. రాజ‌ధానికి సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ – సింగ‌పూర్ ప్ర‌భుత్వాల మ‌ధ్య ఒప్పందం జ‌ర‌గ‌లేద‌ని, అవ‌న్నీ సింగ‌పూర్ సంస్థ‌ల‌తోనే అనే విష‌యం ఇపుడు స్ప‌ష్టంగా తేలిపోయింద‌న్నారు. సింగ‌పూర్ లో ఏం సంస్థ‌ల‌కు రాజ‌ధాని ప‌నులు అప్ప‌గించాలి.. వారి నుంచి మ‌నం ఏం తీసుకోవాలి వంటివ‌న్నీ చంద్ర‌బాబు టీడీపీ పెద్ద‌లు ఎప్పుడో మాట్టాడేసుకున్నార‌ని, ఇపుడు మాత్రం మాస్ట‌ర్‌ప్లాన్ అంటూ ప్ర‌జ‌ల‌ముందు న‌టిస్తున్నారు.. ఎందుకిదంతా.. అని ధ‌ర్మాన నిల‌దీశారు. కాగా తొక్కిస‌లాట‌కు కార‌ణాలు వేరే ఉన్నాయంటూ మంత్రుల‌తో కేబినెట్ భేటీలో చెప్పించ‌డం రాజ‌కీయ దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని ధ‌ర్మాన ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల వ‌ల్లే 29 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం అంద‌రికీ స్ప‌ష్టంగా తెలిసిపోయింద‌న్నారు. 

23 July 2015

అండ‌గా ఉంటా.. అధైన్య‌ప‌డొద్దు.. రైతు భ‌రోసా యాత్ర‌లో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి


తాను అండ‌గా ఉంటాన‌ని, ఎవ్వరూ అధైర్య పడొద్దని వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి రైతుల‌కు భరోసా ఇచ్చారు. బుధవారం అనంత పురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆత్మహత్యకు పాల్పడిన ముగ్గురు రైతుల కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు.  కళ్యాణదుర్గంలోని నూత న వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యాలయం భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొబ్బర్లపల్లి గ్రామంలో  రైతు ఈరన్న కుటుంబాన్ని, ముదిగల్లు గ్రామంలోని రైతు నారాయణప్ప కుటుంబాన్ని, వర్లి గ్రామానికి చెందిన రైతు గంగన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జ‌గ‌న్‌ మాట్లాడుతూ చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతారని విమర్శించారు. బకాయిలు చెల్లించొద్దని ఆయన చెప్పిన మాటలు విని రైతులు రుణాలు చెల్లించలేదన్నారు. దీంతో రుణాలు రెన్యూవల్‌ కాలేదన్నారు. రైతులు ఇన్సూరెన్స్‌ను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ‌మాఫీ కాక అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నా రైతు ఆత్మ‌హ‌త్య కాద‌ని ఆఫీస‌ర్లు బెదిరిస్తున్నార‌ని కొంద‌రు రైతుల కుటుంబాలు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి వివ‌రించాయి. డీఎస్పీ, ఆర్డీవో విచార‌ణ‌కు వ‌చ్చార‌ని, రైతు ఆత్మ‌హ‌త్య కాద‌ని, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని మ‌మ్మ‌ల్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నారంటూ వ‌ర్లి గ్రామానికి చెందిన రామాంజ‌మ్మ జ‌గ‌న్‌కు చెప్పుకుని బోరుమ‌న్నారు. నిజ‌మైన రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌ను కూడా ప్ర‌భుత్వం గుర్తించ‌డం లేద‌ని, అలాంటి వారి వివ‌రాల‌ను సేక‌రించి కోర్టుల్లో కేసులు వేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆ కేసుల‌లో గ‌ట్టిగా పోరాడి ప‌రిహారం వ‌చ్చేలా చూస్తామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ప‌రిహారం ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తున్న రైతు కుటుంబాల వివ‌రాల‌ను సేక‌రించాల‌ని మాజీ ఎంపీ అనంత వెంక‌ట్రామిరెడ్డికి సూచించారు. ఐదు ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించి మూడు ల‌క్ష‌లే ఇచ్చార‌ని ముదిగ‌ల్లులో నారాయ‌ణ‌ప్ప కుటుంబ స‌భ్యులు జ‌గ‌న్‌కు వివ‌రించారు. 

జ‌నం మ‌ధ్య జ‌న‌నేత‌


పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌నిషి.  ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా జ‌నంతో మ‌మేకం అవుతారు. ఇప్పుడు అనంత‌పురం జిల్లా లోని రైతు భ‌రోసా యాత్ర‌లో ఇదే క‌నిపిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో జ‌న ప్ర‌భంజ‌నం అగుపిస్తోంది. మూడో విడ‌త రైతు భ‌రోసా యాత్రంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ క‌ళ్యాణ దుర్గం నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. మొద‌ట‌గా క‌ళ్యాణ దుర్గంలో నిర్మించ త‌ల‌పెట్టిన పార్టీ కార్యాల‌య భ‌వ‌నానికి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా నేత‌లు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. త‌ర్వాత బ్ర‌హ్మ స‌ముద్రం మండ‌లం పొబ్బ‌ర‌ప‌ల్లి గ్రామంలోఆత్మ హ‌త్య చేసుకొన్న రైతు ఈర‌న్న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు. అనంత‌రం ముదిగ‌ల్లు లో బోయ నారాయ‌ణ‌ప్ప కుటుంబానిది, ప‌ర్ణిలో గంగ‌ప్ప కుటుంబానిది ఇదే ప‌రిస్థితి. వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో జ‌న ప్ర‌భంజ‌నం స్ఫ‌ష్టంగా క‌నిపించింది. వెఎస్ జ‌గ‌న్ ను క‌లిసేందుకు, యాత్ర‌కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్య‌లో జ‌నం త‌ర‌లి వచ్చారు. యాత్ర పొడ‌వునా అశేష సంఖ్య‌లో అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పాల్గొన్నారు. 

నాడు రాళ్లేసి.. ఇపుడు దండలేస్తారా?

రాహుల్ చేసేది పరామర్శ యాత్ర కాదు
జనం కష్టాలు చూసి ఆనందించే యాత్ర..
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 24 నుంచి అనంతపురంలో పరామర్శయాత్ర చేపడుతున్నారు. ‘‘ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించటానికి వస్తున్నారా? లేదా వాళ్ళు అడ్డంగా నరికిన రాష్టం ఎలా ఉందో చూడటానికి వస్తున్నారా?’’అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ప్రజలు చీదరించుకుంటున్నారు. పేరుకు రైతు కుటుంబాల పరామర్శే అయినా పార్టీకి మళ్లీ జవసత్వాలు తీసుకురావడమే రాహుల్‌గాంధీ లక్ష్యమని చిన్నపిల్లాడినడిగినా చెబుతాడు. అయితే అది కలలోని మాటే. తన యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ అనేక సర్కస్ ఫీట్లు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని అంటున్నారు. రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో కీలకపాత్ర పోషించిన వైఎస్‌పై మరణానంతరం ఎన్నో అభాండాలు వేశారు.. ఆ మహానేత పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.  మహానేత మరణించిన తర్వాత కూడా రాళ్ళు వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది.వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని అనేక అవమానాల పాల్జేసి, కేసులు మోపిదారుణాతి దారుణంగా కక్షసాధించి  హింసించిన చరిత్ర కాంగ్రెస్‌ది. వైఎస్ కుటుంబాన్ని వేధించడానికి చివరకు తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిన నీచమైన చరిత్ర ఆ పార్టీది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడికి గానీ వైఎస్ స్మృతి చిహ్నాలను తాకే నైతిక అర్హత లేనే లేదు.వృద్ధ జంబూకాల చెప్పుడు మాటలు విని కూర్చున్న కొమ్మను నరుక్కున్న ఫలితాన్ని ఇపుడు కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తున్నది. 


  •  రాహుల్‌గాంధీ చేసేది రైతు పరామర్శ యాత్రా లేక అడ్డగోలుగా విభజించిన రాష్ర్టంలో ప్రజలు ఎన్నికష్టాలు పడుతున్నారో చూసి ఆనందించే యాత్రా? రాహుల్, సోనియాలు ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా నరికిన ద్రోహులు.వారిని తెలుగు ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
  •  
  •  ఇప్పుడు మళ్ళీ వైయస్‌ఆర్ గారు గుర్తొచ్చారా? 2004లోనూ, 2009లోనూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావటానికి కారణమైన నాయకుడు పట్ల 2009 సెప్టెంబరు నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ వాళ్ళు చేయని అఘాయిత్యాలు ఉన్నాయా?
  •  
  •  వైయస్‌ఆర్ కుటుంబం మీద, వైయస్‌ఆర్ మీద- పగబట్టిన పార్టీలు ఏవి అంటే ఒకటి టీడీపీ, రెండు కాంగ్రెస్ అని తెలుగు వారు ఎవరైనా చెబుతారు. మహానేత మరణించిన తర్వాత లొంగలేదన్న కోపంతో వైయస్‌ఆర్‌ను మహానేతగా చూడటం ఇష్టంలేక జగన్ మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్ర చేయటానికి వీల్లేదని ఆదేశించిన దౌర్భాగ్య చరిత్ర సోనియాది, కాంగ్రెస్‌ది కాదా? 
  •  
  •  ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలనందర్నీ ఒకే చోటికి పిలిపించి ఓదార్పు చేయమన్నది సోనియా, రాహుల్‌లు కాదా? చనిపోయిన కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి.. ఈరోజుకీ అర్థ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదా మీరు రాజశేఖరరెడ్డిగారికి అందించే నివాళి?
  •  
  •  తెలుగుదేశం పార్టీతో కలిసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసు వేయించింది కాంగ్రెస్ పార్టీ కాదా? పై నుంచి ఆదేశాలు ఇచ్చి డాక్టర్ వైయస్‌ఆర్ పేరును చార్జిషీట్‌లో పేర్కొనేలా చేసింది కాంగ్రెస్ కాదా?
  •  
  •  ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ మంత్రులంతా వ్యక్తిగతంగా వైయస్‌ఆర్‌ను నిందించటం నిజం కాదా? చివరికి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారని, కరెంటు ఫ్యూయల్ సర్దుబాటు ఛార్జీలు ప్రజల మీద విధించకుండా రాష్ట్ర ఖజానాకు నష్టం చేశాడని కాంగ్రెస్ నాయకులంతా మొరుగుతుంటే రాహుల్ గాంధీకీ, సోనియా గాంధీకి ఆ కారుకూతలు వినపడలేదా? ఇది లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాదు.. ఇది వారి వ్యక్తిత్వంలో ఉన్న లోపం.
  •  
  •  ఆ తర్వాత రాష్ట్ర విభజనకు కారణమైన ప్రతి పరిణామాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసికట్టుగా చేసి మహానేత కుటుంబం మీద ఉమ్మడిగా దాడి చేయటం నిజం కాదా?
  •  
  •  చివరికి రాష్ట్ర విభజన బిల్లు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చంద్రబాబుతో టచ్‌లో ఉండి ఇద్దరూ కలిసి రాష్ట్ర విభజన చేయటం నిజం కాదా?
  •  
  •   చంద్రబాబు సొంత మామను, బతికి ఉన్న ఎన్టీఆర్‌ను అధికారం నుంచి కిందకి లాగి ఆయన మరణానికి కారకుడైతే- చంద్రబాబు పంథాలోనే నడిచిన కాంగ్రెస్ ఏకంగా చనిపోయిన నాయకుడి మీదే దాడి చేసి అంతకన్నా దిగజారింది. ఇంత నీచ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని రాజశేఖరరెడ్డిగారి విగ్రహాలకు దండలు వేస్తోంది. రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకొని వైయస్‌ఆర్ విగ్రహం వద్దకు వెళుతున్నాడు?
  •  
  •  కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన తెలుగుదేశం పార్టీతో జత కట్టి అన్నిటిలోనూ చంద్రబాబుతో కలిసి ఊరే గుతున్నది కాంగ్రెస్ కాదా? ఇక కాంగ్రెస్ చరిత్ర అంతా ఆంధ్రప్రదేశ్‌లో పిల్ల టీడీపీగా బతకడమే. 

20 July 2015

21నుంచి మూడోవిడత రైతు భరోసా యాత్ర ప్రారంభం

అనంతపురంజిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలకు పరామర్శ
 ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. గత ఫిబ్రవరి నెల చివరి వారంలో ఐదు రోజుల పాటు, మేలో 8 రోజుల పాటు అనంతపురం జిల్లాలో ఆయన ఈ యాత్రను నిర్వహించారు. ఇప్పుడు మరల అదే అనంతపురం జిల్లా  నుంచి యాత్రను కొనసాగించనున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అసలు ఆత్మహత్యలనేవే లేవని అడ్డగోలుగా వాదిస్తూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శ యాత్ర జరుపుతుండడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించడం ప్రారంభించింది. అంతేకాదు ఆ కుటుంబాలకు పరిహారం కూడా చెల్లిస్తూ వస్తున్నది.
 బుకాయించిన ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా..
 జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసాయాత్రకు శ్రీకారం చుట్టడానికి అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన చర్చ కారణమయ్యింది. అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో వ్యవసాయ దారుల కష్టాల మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గట్టిగా నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా ఏ రకంగా దగా చే స్తూ వస్తోందో సోదాహరణంగా వివరించారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, మాఫీ చేయకపోగా రైతుల్ని అదే పనిగా మభ్య పెడుతూ రావటం వల్ల జరుగుతున్న అనర్థాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించి చెప్పారు. ఆధారాలతో సహా ప్రభుత్వ బండారాన్ని బయట పెట్టారు. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేని ప్రభుత్వం ఆయన మీద ఎదురు దాడిని కొనసాగించింది. అసలు ఈ ప్రభుత్వ హయాంలో రైతులంతా ఆనందంగా ఉన్నారని అడ్డంగా వాదించటమే కాకుండా రైతులు ఎవరూ ఆత్మ హత్యలు చేసుకోవటం లేదని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడింది. దీన్ని ఖండించిన వైఎస్‌జగన్ ..ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల దగ్గరకు తాను వెళతానని, ఆయా కుటుంబాల వివరాల్ని బహిరంగ పరుస్తానని అసెంబ్లీలో స్పష్టం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు.
 ఆత్మహత్యలను అవహేళన చేసిన చంద్రబాబు...
 రైతు భరోసా యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో  అనంత పురం జిల్లా వాసులకు వైఎస్ జగన్ స్వయంగా విడమరిచి చెప్పారు. ‘‘అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై నేను గట్టిగా నిలదీశా. ప్రజల ఓట్లతో అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తామని చెప్పారు. ప్రజలు ఓట్లేసి అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అని గట్టిగా అడిగాను. మీ అబద్దాలు నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. రైతులు, చేనేతలు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. మీరాడిన పచ్చి అబద్దాలతో మోసపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. దీనంతటికీ మీరు కారణం కాదా.. అని అడిగా. 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని గ్రామ, మండల నియోజక వర్గాల వారీగా వివరాల్ని చూపించా. కానీ చంద్రబాబు రైతు ఆత్మహత్యల్ని అవహేళన చేశారు. రైతులు సుఖ సంతోషాలతో, డ్వాక్రా మహిళలు ఆనందంతో ఉన్నారన్నారు. ఎవరూ చనిపోలేదన్నారు. ఆత్మహత్యలు నిజమే అని ఒప్పుకొంటే ఎక్కడ రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని ఒప్పుకోలేదు. అయ్యా..నేను ప్రతీ ఇంటికీ వెళ్లి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారో చూపిస్తా.. అని చెప్పా. ప్రభుత్వం నుంచి ఆదరణ లభించని క్రమంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి, ఆత్మహత్య చేసుకొన్న కుటుంబాలకు భరోసా కల్పించి వారికి అండగా నిలిచేందుకే రైతు భరోసా యాత్ర చేపట్టాను’’అని వైఎస్ జగన్ వివరించారు.
 రెండు విడతలుగా భరోసాయాత్ర
 అనంతపురంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే రెండువిడతలుగా రైతు భరోసాయాత్రను పూర్తి చేశారు. తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంతపురంలో ఆయన భరోసాయాత్ర చేశారు. ఐదురోజుల పాటు ఐదు నియోజకవర్గాలలో జగన్ భరోసాయాత్ర సాగింది. హిందూపురం, పుట్టపర్తి, ఉరవకొండ, సింగనమల, గుంతకల్లు నియోజకవర్గాలలో 780 కిలోమీటర్లు ప్రయాణించిన జగన్ తొమ్మిది చోట్ల జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. 10 కుటుంబాలలో ఆత్మహత్య చేసుకున్న 11 మంది రైతు కుటుంబాలను జగన్ పరామర్శించారు. వారిని మరామర్శించి వారిలో మనోధైర్యం నింపారు. మేలో జరిగిన రెండో విడత భరోసాయాత్ర సందర్భంగా 11 రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. రాజకీయ కారణాలతో హత్యకు గురైన ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ నేతల కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు. రెండోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి 8 రోజులపాటు పర్యటించారు. 1150 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గంలలో జగన్ పర్యటించారు.
 మూడో విడత భరోసా యాత్ర ఇలా...
 ఈనెల 21 నుంచి అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడవ విడత రైతు భరోసా యాత్ర ప్రారంభమవుతుంది. 21వ తేదీ కళ్యాణదుర్గంలోని శెట్టూరు నుంచి ప్రారంభమై 22,23 తేదీలలో ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది. 24 నుంచి పెనుకొండ, మడకశిర నియోజకవర్గాలలో యాత్ర సాగుతుంది. 21న శెట్టూరులో మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభ అనంతరం ఒక కార్యకర్త కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. 22వ తేదీన శెట్టూరు మండలంలోని కైరేవు గ్రామంలో ఒక రైతు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఆతరువాత కళ్యాణదుర్గం మండలంలోని ముదిగళ్లు, వర్లి గ్రామాల్లోని రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. 23వ తేదీన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం తిమ్మాపురం, వంటారెడ్డిపల్లిలో జగన్ భరోసా యాత్ర సాగుతుంది. 

అట్లాంటాలో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు


మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలు అమెరికాలోని అట్లాంటాలో శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. వైఎస్‌ఆర్‌సీపీ అమెరికా ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, కొరుముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చలమలశెట్టి సునీల్, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, మేడపాటి వెంకట్, శ్రీనివాస్ కలబంద, యాదం బాలాజి తదితరులు పాల్గొన్నారు. ఈ జయంతి వేడుకల్లో వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లాసికల్ సింగర్ పద్మశ్రీ శోభారాజు భక్తి పాటలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికాలోని వైఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగ కన్వీనర్ గురవారెడ్డి గౌరవ అతిథులను ఆహ్వానించారు. అనంతరం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి వద్ద మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 600 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్‌ఆర్‌తో తమకు ఉన్న అనుభవాలను అందరూ పంచుకున్నారు. వైఎస్‌ఆర్ విశిష్ట నాయకత్వం నుంచి తాము ఎలా స్ఫూర్తి పొందారో వివరించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, పావలా వడ్డీ వంటి సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని ప్రజలను డాక్టర్ వైఎస్‌ఆర్ ఎలా అభివృద్ధి పథం వైపు నడిపించారో పలువురు వక్తలు సోదాహరణంగా వివరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతు పలకడం ద్వారానే స్ఫూర్తివంతమైన డాక్టర్ వైఎస్‌ఆర్ వారసత్వాన్ని, విజన్‌ను కొనసాగించడం సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

11 July 2015

చంద్రబాబు ఒప్పందాల లో గుట్టు ఏమిటి..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా జపాన్ వెళ్లి వచ్చారు. ఎప్పటిలాగే ఆయన వెంట కోర్ కమిటీ కీలక మంత్రులు తరలి వె ళ్లారు. చాలా ఒప్పందాలు జరిగాయని, రాష్ట్రానికి  పెట్టుబడులు వరదలా ప్రవహిస్తాయని చెప్పుకొచ్చారు. ఇంతకీ, ఒప్పందాల పూర్తి వివరాలు ఏమిటి, ఎమ్ ఓ యూల వివరాలు ఏమిటి  అనేది మాత్రం రహస్యంగానే ఉంచుతున్నారు.

 సమస్తం సింగపూర్ మయం
 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏ ముహుర్తాన ప్రమాణ స్వీకారం చేశారో తెలీదు కానీ, ప్రభుత్వ సొమ్ముతో జోరుగా షికారు చేసి వస్తున్నారు. ముఖ్యంగా సింగపూర్ తో అయితే చె ట్టపట్టాల్ వేసుకొని మరీ తిరుగుతున్నారు. పదవిలో లేకపోయినా, చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా సింగపూర్ కు వెళ్లి వచ్చేవారు. అక్కడ ఆస్తుల్ని సమకూర్చుకొన్నారని, అందుకే అక్కడకు తరచు వెళుతున్నారని చెప్పుకొనే వారు. ఈ విషయం అలా ఉండగానే చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, రాజధాని పనుల బాధ్యత మొత్తంగా సింగపూర్ కే అంకితం అన్న ప్రకటన  రావటం జరిగిపోయింది. ఇక అప్పటి నుంచి సింగపూర్ హడావుడి జోరుగా సాగింది. ఇక్కడ నుంచి అక్కడకు ఏమి వెళుతోందో, అక్కడ నుంచి ఇక్కడకు ఏమి వస్తోందో అంతా రహస్యమే. అన్నీ అయ్యాక మాస్టర్ ప్లాన్ అంటూ ఒక డాక్యుమెంట్ మాత్రం రిలీజ్ అయ్యింది. ఇక అంతే సంగతులు. రాజధాని విషయంలో అంతటి అత్యుత్సాహం ఎందుకు, వేల ఎకరాల దోపిడీ  ఎందుకు అనే దానికి మాత్రం సూటిగా జవాబులు లభించలేదు.

 చైనా కు సలామ్
 ఈలోగా చైనా వంతు వచ్చింది. చంద్రబాబు నాయుడు టీమ్ చైనాకు వెళ్లి వచ్చింది. అక్కడ నుంచి ఏం తెచ్చుకొన్నారో, ఏం ఒప్పుకొన్నారో తెలీదు కానీ రాష్ట్రంలో వేల కొద్దీ ఎకరాల భూమి అప్పగించేందుకు సిద్దంగా ఉందని ప్రకటన చేశారు. దీంతో చైనా బృందాలు రాష్ట్రానికి వచ్చి వెళ్లాయి. అన్నీ చూశాక, విజయవాడలోని భవానీ ద్వీపం నచ్చిందని నిర్ధారణ కు రావటమే తరువాయి, దీన్ని చైనా కు అప్పగించేందుకు ప్రభుత్వం తల ఊపేసింది. ఇక్కడ అంతే.. అసలు ఒప్పందం ఏ ప్రాతిపదికన జరుగుతోంది, ఏ ఏ అంశాల్ని దృష్టిలో పెట్టుకొన్నారు.. అసలు ఇంత హడావుడిగా ఒప్పందం ఎందుకు అన్న దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 అసలు మ్యాటర్ జపాన్ తో..!
 ఇటీవల కాలంలో చంద్రబాబు నోట జపాన్ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో చాలా వరకు నిర్మాణాలు చేపట్టబోయేది జపాన్ కంపెనీలే అని తేల్చి చెప్పుతున్నారు. హీరో హోండా కంపెనీకి 600 ఎకరాలు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఏ ప్రాతిపదికన కేటాయింపులు చేస్తున్నారో వె ల్లడించటం లేదు. జపాన్ తో నిర్మాణాలకు ఒప్పందం కుదుర్చుకొంటున్నప్పుడు ప్రాతిపదికలు వె ల్లడించాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. మరో వైపు రాష్ట్రంలో జపాన్ బృందాల అవసరాల కోసం చక చకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి రెడ్ కార్పెట్ పరచి పనులు సాగిస్తున్నారు.

 విద్యుత్ ఒప్పందంలోనూ మతలబు..!
పోలాకి దగ్గర ఏర్పాటు తలపెట్టిన థర్మల్ విద్యుత్‌ఉత్పత్తి కేంద్రం కోసం జపాన్ సంస్థ తో ఒప్పందం చేసుకొన్నారు దీని కోసం 2వేల 500 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. అయితే ఈ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకొన్న ఎమ్ ఓ యూ  ని మాత్రం బయటకు వెల్లడి చేయటం లేదు. ఆఖరికి సమాచార హక్కు చట్టం కింద పిటీషన్ వేసినా కూడా వివరాలు బయటకు రానీయటం లేదు. మౌళిక వసతుల కల్పన చట్టం కు విరుద్ధంగా ఒప్పందం చేసుకొన్నట్లు విమర్శలు వస్తున్నప్పటికీ, ప్రభుత్వం గోప్యంగా పనులు సాగిస్తోంది.
  ఈ విధంగా ప్రభుత్వం విదేశీ సంస్థలతో చక చకా ఒప్పందాలు చేసుకొంటోంది తప్పితే దీనికి సంబంధించిన ఒప్పంద వివరాలు మాత్రం బయటకు రానీయటం లేదు. అరకొరగా వివరాలు అందించి చేతులు దులుపుకొంటున్నారు. దీన్ని బట్టి ఈ ఒప్పందాల వెనుక గుడుపుఠాణీ జరుగుతోంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది

10 July 2015

భూసేకరణపై వెనక్కి తగ్గిన చంద్రబాబు

భూ సమీకరణకు ఒప్పుకోని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఘీంకరించారు. సమీకరణకు సహకరించని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా బెదిరిస్తూ వచ్చారు. అయితే రైతులకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ రంగంలోకి దిగడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. రాజధాని రైతులను చైతన్యపరచడంలోనూ, వారికి అండగా ఉంటూ ఉద్యమాలు చేయడంలోనూ వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ ముందు ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ కుయుక్తులను గమనిస్తూ రైతులను అప్రమత్తం చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తుండడం వల్లనే చంద్రబాబు ప్రభుత్వం సవరించిన భూసేకరణ చట్టాన్ని రాజధాని రైతులపై ప్రయోగించలేకపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం.  భూ సమీకరణ ద్వారా 25 వేల ఎకరాలను సమీకరించిన ప్రభుత్వం ప్రతిపాదిత 33వేల ఎకరాలలో మిగిలిన 8 వేల ఎకరాలను భూసేకరణ చట్టాన్ని ఉపయోగించి సేకరించాలని తలపోసింది. స్థానికుల ఆమోదం, సామాజిక ప్రభావం మదింపు, బహుళ పంటలు పండే భూములు వంటి అంశాలలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆర్‌ఎస్‌ఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తున్నాయి. దాంతో  కేంద్రప్రభుత్వం భూసేకరణ సవరణలపై ఆలోచనలోపడింది. సామాజిక ప్రభావం మదింపు అంశం నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 166 జారీ చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూసి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అంటున్నారు. ఏమైతేనేం ప్రస్తుతానికి భూసేకరణ చట్టం ప్రయోగించే పరిస్థితి ఎంతమాత్రమూ లేదని తెలుస్తోంది. అందువల్ల రాజధాని రైతులకు ఇది ఊరట కలిగించే అంశమే.

9 July 2015

వాడుకుని వదిలేయడం బాబు నైజం

తాజా ఉదాహరణ పవన్ కల్యాణ్
 రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయడం... అక్కర తీరిన తర్వాత అల్లుడ్ని అదేదో అనడం.. ఓడమీద ఉన్నపుడు ఓ ఓడమల్లయ్య - ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనడం.... అవసరం వచ్చినపుడు కాళ్లు పట్టుకోవడం - అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడం... ఇవి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నైజానికి సరిగ్గా సరిపోలుతాయి. ఆయన నిజస్వరూపానికి ఇవి దగ్గరగా ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ పవన్ కల్యాణ్ ఉదంతం.
  పవన్ కల్యాణ్ పాపం ఎట్టకేలకు 35 రోజుల తర్వాత ఓటుకు కోట్లు వ్యవహారంపై స్పందించారు. కోర్టులో ఉన్న కేసుపై ప్రత్యక్షంగా స్పందించనంటూ దాటవేసినా పార్లమెంటు సభ్యులు తమ బాధ్యత నిర్వహించడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ఎంపీలకు, నాయకులకు ఎంతో కోపం తెప్పించాయి. పవన్ కల్యాణ్ ఏమన్నా ప్రతిపక్ష నాయకుడా? ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి ఆప్తుడే కదా? ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లూ గడ్డం పట్టుకుని పార్టీకి ప్రచారం చేయమని అడిగిన సంగతి తెలుగుదేశం ఎంపీలు, నాయకులు మర్చిపోయారా? ఒకే వేదికపై నుంచి పవన్‌తో ప్రచారం చేయించుకున్న సంగతి మర్చిపోయారా? చంద్రబాబు ఇచ్చిన హామీలన్నిటికీ తానే పూచీ అని పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ఒక మాట అన్నాడని తెలుగుదేశం నాయకులు, ఎంపీలు రెచ్చిపోతున్నారు. పవన్ టీఆర్‌ఎస్‌తో కలసిపోయాడని ప్రచారం చేసేవరకు వెళ్లిపోయారు. పవన్ - కేసీఆర్ ఒక్కటైపోయారని ప్రచారం చేసేవరకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను గానీ, ప్రభుత్వాన్ని గానీ ఎవరూ విమర్శించకూడదా? ఎవరు విమర్శిస్తే వారు కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేస్తారా? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ ప్రశ్నిస్తే మీరు కేసీఆర్‌తో కలసిపోయారంటూ దుష్ర్పచారానికి తెలుగుదేశం పార్టీ వారు దిగజారారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఆరోజు ఎందుకు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకున్నారు... ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు పవన్ కల్యాణ్ జుట్టు పట్టుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు ప్రత్యేకంగా జవాబులు వెతకనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నైజమే అది. ఆ పార్టీ అధినాయకుడి నైజమే అది. ఆయన దగ్గర నుంచి కింది స్థాయి వరకు నాయకులంతా ఆ నైజాన్ని పుణికి పుచ్చుకున్నారు.
 నారావారి వాడుకుని వదిలేసే నైజానికి అనేక ఉదాహరణలు... ః
 - తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, వెండితెర వేలుపు నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నేత. ఆయన్ని వాడుకున్నారు వెన్నుపోటు పొడిచి వదిలేశారు.
 - ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన వెంటనే ఆయన కుటుంబంలో ఎక్కడా వ్యతిరేకత రాకుండా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణను తీసుకొచ్చి అందలమెక్కించారు. ఎమ్మెల్యే కాకపోయినా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌ను చేశారు. ఆ తర్వాత పక్కకు నెట్టేశారు. వాడుకుని వదిలేశారు.
 - తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుదీ అదే కథ. తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి పూర్వమే ఎన్టీఆర్ అడుగులో అడుగువేసి నడిచిన వ్యక్తి ఆయన అల్లుడు దగ్గుబాటి. ఎన్టీఆర్‌ని దించేసేటపుడు దగ్గుబాటిని తీసుకొచ్చి ఆయన సలహాలను ఆలోచనలను వాడుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను కూడా వదిలేశారు. ఆయన ఇపుడు కాంగ్రెస్, బీజేపీల చుట్టూ తిరుగుతున్నారు.
 - ఎన్టీఆర్ కుటుంబంలోనే మరో వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్‌ను పోలి ఉంటాడని, కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయని చూసుకుని ఆయన్ను తీసుకువచ్చారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను రాష్ర్టమంతా ప్రచారం కోసం తిప్పారు. ఆ తర్వాత ఆయన్నీ వదిలేశారు. అంతేకాదు అసలు ఆయన సినిమాలు కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు చూడకూడదని హుకుం జారీ చేశారు. లోకేశ్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కకు నెట్టేశారు.
 - అలనాటి అందాలనటి జయప్రద. ఆమెనూ అంతే. పార్టీలో ఆమెను సాధ్యమైనంతగా వాడుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు.
 - ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత ఉంటుంది జాబితా. ఆ జాబితాలో తాజా ఉదాహరణ పవన్ కల్యాణ్. ఆయన్ని 2014 ఎన్నికల్లో ప్రచారం కోసం వాడుకున్నారు. ఇపుడు వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
  ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్‌నుకాళ్లు పట్టుకుని తీసుకొచ్చిన చంద్రబాబు ఇపుడు తమ నాయకుల చేత ఆయన్ని తిట్టిస్తున్నారు. సినిమాలు చూసుకోండి మీకు రాజకీయాలెందుకు అని చెప్పిస్తున్నారు. మళ్లా ఎన్నికల ముందు వచ్చి సపోర్ట్ చేస్తే చాలు ఆయనకి. మిగిలిన సమయమంతా ఎవరు పని వాళ్లు చేసుకోవాలి. ఏం చేసినా చంద్రబాబును, ఆయన పార్టీ నాయకులను ఎవరూ ఏమీ అనకూడదు. అదే మని నిలదీయకూడదు. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు నడపడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. దీన్నంతటినీ ప్రజలు గమనిస్తున్నారు. వాడుకుని వదిలేయడమనే చంద్రబాబు పాలసీని చూస్తున్నారు. పాపం ఈ విషయం తెలియక పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంతకు వెళ్లాడు. ఇపుడు ఆయన చేతులు కాలుతున్నాయి. ఆకుల కోసం వెతుక్కుంటున్నాడు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ అభిమానులు కూడా గ్రహించారు. తెలుగుదేశం పార్టీ కుట్రను, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుయుక్తులను, నైజాన్ని రాష్ర్ట ప్రజలు మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు గ్రహిస్తున్నారు. 

పుష్కర సేవల్లో వైఎస్‌ఆర్‌సీపీ

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న గోదావరి నది పుష్కరాలకు తరలివచ్చే యాత్రికులకు సేవలు అందించడానికి గాను తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సిద్ధమౌతున్నాయి. యాత్రికుల సౌకర్యార్థం రోజుకు 10 ఉచిత బస్సులు నడడపం, పసిపిల్లలకు పాలు పంపిణీచేయడం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం, మంచినీరు సరఫరా చేయడం, యాత్రికుల సామాను భద్రపరిచేందుకు గాను క్లోక్ రూమ్‌లు ఏర్పాటు చేయడం, ఘాట్‌ల వద్ద సేవాదళ్ సహాయ కార్యక్రమాలు, వృద్ధులు, వికలాంగులకు వీల్ చెయిర్లు ఏర్పాటు చేయడం, డాక్టర్ వైఎస్‌ఆర్ సమాచార కేంద్రాలు నెలకొల్పడం, డస్ట్‌బిన్‌లను ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమగ్నమౌతున్నది. పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఈ వివరాలను వెల్లడించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను కలసి పుష్కరసేవలకు సంబంధించిన పది అంశాలతో కూడిన పత్రాన్ని అందించారు. అంతకుముందు పార్టీ నేతలు గాంధీనగర్‌లో సమావేశమై పుష్కరాలలో అందించే సేవలపై చర్చించారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు ఇందులో పాల్గొన్ని సూచనలు, సలహాలు అందించారు. ఏఏ ప్రాంతాల్లో ఎవరు సేవలు అందించాలి..? యాత్రికుల రద్దీ అధికంగా ఉండే ఘాట్లేవి.. వంటి అంశాలను చర్చించారు.

8 July 2015

వైఎస్సార్ కు ఘ‌న నివాళులు


దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి కుటుంబ స‌భ్యులు, అబిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న సతీమ‌ణి భార‌తి, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌, విజ‌య‌మ్మ‌, అవినాష్ రెడ్డి ఇత‌ర కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. ఇడుపుల పాయ‌లోని వైఎస్ స‌మాధి ద‌గ్గ‌ర ప్రార్థ‌న‌లు చేశారు. ఇత‌ర కుటుంబ స‌భ్యులు, బంధువులు, మిత్రులు, అభిమానులు ఉద‌యం నుంచే అక్క‌డ‌కు చేరుకొన్నారు. ముందుగా వైఎస్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేశారు. అనంత‌రం స‌మాధి దగ్గ‌ర చాలా సేపు మౌనంగా ఉండి వైఎస్ కు నివాళులు అర్పించారు.

7 July 2015

అపర భగీరథుడిపైనే అభాండాలా?

 అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే వైఎస్ ఘనత
 పొలిటికల్ విల్ ఉన్న నేత వైఎస్‌ఆర్
 ప్రాణహిత వైఎస్‌ఆర్  మానసపుత్రిక
 ఆయనే ఉంటే ప్రాజెక్టు పూర్తి చేసి చూపేవారు
 ద్వేషించినవారే తెలంగాణ కాటన్ అంటూ పొగడలేదా?

  వైఎస్‌ఆర్... ఈ మూడు అక్షరాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. భారాలు, కరువు కాటకాలతో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమబాట పట్టించిన కృషీవలుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. రైతులు పదిమందికి అన్నంపెట్టే స్థాయిలో ఉండాలని, ఆడపడుచులు కంటతడి పెట్టే పరిస్థితి రాకూడదని, పేదలకు కూడు గూడు గుడ్డకు అలమటించే దుస్థితి ఉండకూడదని ఆయన అనుక్షణం తపించారు.  ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పథకానికి రూపకల్పన చేసినా ఆ దిశగానే ఆలోచించారు. మాట తప్పడం మడమ తిప్పడం ఆయనకు తెలియదు. మాట ఇస్తే అది శిలాశాసనమే. ప్రభుత్వానికి ఎంత భారమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచించుకోవలసిందే తప్ప మాట తప్పడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తరచూ చెప్పిన మాటలివి. ఉచిత విద్యుత్ అయినా, జలయజ్ఞమైనా, రెండు రూపాయలకు కిలో బియ్యమైనా, ఫీజు రీయింబర్స్‌మెంట్ అయినా, ఆరోగ్య శ్రీ అయినా కులాలకతీతంగా, మతాల కతీతంగా, ప్రాంతాలకతీతంగా, పార్టీలకతీతంగా అర్హులందరికీఅందాలని వైఎస్ ఆశించేవారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన చరిత్ర ఆయనది. ఉచిత విద్యుత్ దేశంలో ఎక్కడా అమలు చేయలేకపోయారు. తీగలపై బట్టలారేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేసిన వారు చివరకు ఆయన అడుగుజాడలను అనుసరించాల్సిన పరిస్థితి. అంతటి దార్శనికుడు వైఎస్‌ఆర్. ఆయన జీవించి ఉండగానే గుడ్డుపై ఈకలు పీకినవారు, అవాకులు చెవాకులు పేలినవారు, రాసినవారు, ప్రసారం చేసినవారు మరణించిన తర్వాత కూడా వాటిని ఆపలేదు. 85 కొత్తప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న ముందుచూపుతో అపరభగీరధుడు వైఎస్ ప్రారంభించిన బృహత్‌పథకం జలయజ్ఞంలో చిన్నచిన్న లోపాలపై అలాంటి ప్రచారాలే అప్పుడు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి వైఎస్‌పై అభాండాలు వేయడానికి, రాయడానికి చాలామంది ఉత్సాహపడుతున్నారు. అలాంటి వారికి ఇదే సమాధానం.

 - పెద్ద మనుషుల గురించి, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కనీస మర్యాదలు, సంస్కారాలు పాటించాలని ఆశిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రాణహిత-చేవెళ్ళ పథకాన్ని కట్టగలరా? కట్టలేరా? దాని డిజైన్ మారుస్తారా? లేక పూర్తిగా పక్కనపెడతారా? అన్నది ఆయన ఇష్టం. అయితే, మహానేత డాక్టర్ వైయస్సార్ గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు సరైనది కాదు.

 - ప్రాణహిత నుంచి చేవెళ్ళకు 600 కిలో మీటర్లు. కొండలు, గుట్టల మధ్య నీరు ఎలా తీసుకువస్తారని కేసిఆర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఆయన ప్రాణహిత-చేవెళ్ళకు డాక్టర్ వైయస్సార్ ముఖ్యమంత్రిగా శంఖుస్థాపన చేసిన నాడు ఎందుకు అడగలేదో ముందు చెప్పాలి. 2008 డిసెంబరులో, అంటే మహానేత మరణానికి పది నెలల ముందు ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేస్తున్నప్పుడు డాక్టర్ వైయస్సార్‌ను జీవితాంతం ద్వేషించిన వెంకటస్వామి వంటి వారు కూడా ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. తెలంగాణ కాటన్ వైయస్ అని వెంకటస్వామి చెప్పటమే కాకుండా ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రాణం వస్తుందని కీర్తించారు. మరి ఆరోజున కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించలేదు?

 - ఏ ప్రాజెక్టు అయినా నాయకుడి పొలిటికల్ విల్ మీద ఆధారపడి ఉంటుంది. దాని డిజైన్ ఇంజినీరింగ్ నమూనాల మీద ఆధారపడి ఉంటుంది. 600 కిలో మీటర్లు మేర ప్రాణహిత నుంచి నీరు తీసుకురావటం అన్నది ఇంజినీరింగ్ డిజైన్‌కు సంబంధించిన అంశం. చేవెళ్ళ వరకు కూడా గోదావరి జలాలు తప్ప మరోరకంగా నీటిని తీసుకురాలేం కాబట్టి లిఫ్ట్‌లు పెట్టైనా, ఆపని పూర్తి చేయాలి అన్నది ఒక నాయకుడి పొలిటికల్ విల్‌కు సంబంధించిన అంశం. 600 కిలో మీటర్లు తీసుకు రాగలను అన్నది వైయస్సార్‌గారి నమ్మకం. తీసుకురాలేను అన్నది కేసీఆర్ అభిప్రాయం.

 - తెలంగాణకు జీవం తీసుకురావాలంటే ఏటా నీరు వృధా పోతున్న గోదావరి నుంచి ఆ పని చేయగలమా? లేక మరోమార్గం ఉందా? ఒక్క తెలంగాణలోనే గోదావరికి చెందిన అనేక ఉపనదులు కలుస్తున్నాయి. ఈ ఉపనదుల నీరు అంతా చివరికి ఏపీ నుంచి ప్రవహించి ఉప్పు సముద్రంలో కలిసిపోతుంది. ప్రాణహిత నుంచే ఎక్కువ నీరు గోదావరిలో కలుస్తోంది. ఇవన్నీ అందరూ అంగీకరించే వాస్తవాలే. అలాంటప్పుడు ప్రాణహితను కేవలం అదిలాబాద్ వరకు మాత్రమే పరిమితం చేయాలన్న కేసీఆర్ ఆలోచన ఎంతవరకు సమంజసం?

 - 1983 నుంచి 2001 వరకు కేసీఆర్ టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్న 18 ఏళ్ళలో టీడీపీ తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఏం చేసిందో కేసీఆర్ చెప్పగలరా? ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా ఆరోజుల్లో టీడీపీ తెలంగాణలో నిర్మించిందా? పోనీ కేసీఆర్ అభిమానించే నాయకుడు ఎన్టీఆర్ అయినా తెలంగాణలో ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా చేపట్టాడా?

 - అంతకన్నా దారుణం ఏమిటంటే-ఆరోజుల్లోనే తెలుగుదేశం పార్టీ రైతులకు ఇచ్చే వ్యవసాయ విద్యుత్ మీద చార్జీలు పెంచుతూ పోయిన మాట వాస్తవం కాదా?

 - వైయస్సార్  గురించి నోరు తూలినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించే సమయానికి తెలంగాణలో మొత్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 13.78 లక్షల టన్నులు. 2003-04 నాటికి అది 57.99 లక్షల టన్నులకు చేరింది. అంటే దాదాపు 44 లక్షల టన్నులు పెరిగింది.  1994-95లో అంటే తెలుగుదేశం పార్టీ మరోసారి పరిపాలన చేపట్టిన సంవత్సరంలో తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 41.60 లక్షల టన్నులు అయితే 2003-04 నాటికి అది 57.99 లక్షల టన్నులకు చేరుకుంది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో 16.39 లక్షల టన్నులు మాత్రమే పదేళ్ళలో పెరిగింది. ఆతర్వాత పదేళ్ళలో, అంటే ప్రధానంగా వైయస్సార్ పరిపాలనలో అప్పటికప్పుడు భారీ ప్రాజెక్టులు పూర్తి కాకపోయినా, కేవలం లిఫ్ట్‌లు, బోర్లకు ఉచిత విద్యుత్ అందించటం ద్వారా తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయింది. 2013-14 వచ్చే సరికి అది 107 లక్షల టన్నులకు చేరింది. అంటే కేవలం పదేళ్ళలోనే రైతులకు డాక్టర్ వైయస్సార్ ద్వారా అందిన ఉచిత విద్యుత్ వల్ల అయితేనేమి, లిఫ్ట్‌ల ద్వారా అందించిన నీటి వల్ల అయితేనేమి ఏకంగా 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అదనంగా పండించే శక్తి లభించింది.
 1956 నుంచి 2004 వరకు కేవలం 44 లక్షల టన్నుల పెరుగుదల నమోదు అయితే, గత పదేళ్ళలోనే 50 లక్ష ల టన్నులు అదనంగా తెలంగాణ రైతు ఉత్పత్తి చేయగలిగాడు. ఇది డాక్టర్ వైయస్సార్ పొలిటికల్ విల్ ఫలితంగానే సాధ్యం అయ్యింది.

 - 2013-14 డేటానే తీసుకుంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో 115 లక్షల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. పంట భూమి 60 శాతం ఏపీలో ఉంటే, 40 శాతం మాత్రమే తెలంగాణలో ఉంది. అయినా ఈ 40 శాతానికి ఉచిత విద్యుత్, లిఫ్ట్‌ల ద్వారా అందించిన నీటి సదుపాయం వల్ల 2013-14లో తెలంగాణలో ఏకంగా 107 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యింది.

 - ఈ డేటా అంతా కేసీఆర్ ఆయన స్వహస్తాలతో తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది సమర్పించుకున్న సోషియో ఎకనమిక్ అవుట్ లుక్ 2015లో పేజీ నంబరు 175లో ఉంది. కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు.

 - మహానేత వైయస్సార్ గురించి మాట్లాడటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ రైతుకి ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉద్యమించిన వ్యక్తి ఎవరు అంటే- ఏ ఒక్కరూ కేసీఆర్ పేరు చెప్పరు. వైయస్సార్ పేరే చెబుతారు. తెలంగాణలో పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి ఒక్క పైసా పన్నులు గానీ, చార్జీలు గానీ పెంచకుండా మహా నిర్మాణాలు ప్రారంభించింది ఎవరంటే- కేసిఆర్ పేరు ఎవరూ చెప్పరు. వైయస్సార్ పేరే చెబుతారు.

 - కేసీఆర్ ప్రాజెక్టులు కట్టాలి. తెలంగాణలో ప్రతి ఎకరానికి నీటి సదుపాయం కల్పించాలి. చేతలలో చేసి చూపాలి. మాటలు మీరకూడదని వైఎస్‌ఆర్ అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు.

 - జులై -8 ఆ మహానేత 66వ జయంతి. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్న రైతు, రైతాంగం, 108, ఫీజు రీయింబర్స్‌మెంటు, పక్కా గృహాలు వంటి అనేక పథకాల ద్వారా వైయస్సార్‌ను గుండెల్లో పెట్టుకున్న ప్రజానీకం ఆయన్ను గుర్తు చేసుకునే శుభదినం. వైయస్సార్ భౌతికంగా లేకపోయినా తెలంగాణ పాడి పంటల్లోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంక్షేమ పథకంలోనూ ఎప్పటికీ జీవించి ఉంటారన్న సత్యాన్ని కేసిఆర్ గానీ, మరో నాయకుడు గానీ వైయస్సార్‌ను విమర్శించే ముందు గుర్తుంచుకోవాలి.

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓట్లకు కోట్లు


కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓట్లకు కోట్లు కురిపించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ విలువలకు పాతర వేసిన చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. లంచాల సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేశారని, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లకు కోట్లు గుమ్మరించారన్నారు. అధికారాన్ని  అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరించారని, తప్పు చేసి తిరిగి వాళ్లే కేసులు పెట్టారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కర్నూలు లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూమానాగిరెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించినా..కక్ష గట్టి కర్నూలులోనే ఉంచారన్నారు. అదేమంటే హైదరాబాద్ వేరే రాష్ట్రం అంటున్నారని, మరి చంద్రబాబుకు అక్కడే నివాసం ఉందని, ఓటర్, ఆధార్‌కార్డు కూడా హైదరాబాద్‌లోనే ఉందని, అలాంటప్పుడు అది వేరే రాష్ట్రమన్నవిషయం గుర్తు రాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

 డోన్ట్ టచ్ మీ అంటే  ఎట్రాసిటీ కేసు పెట్టేస్తారా..!
 కర్నూలు) పభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని  వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డిపై కుట్ర చేసి కేసు పెట్టారని, ఎమ్మెల్యే అఖిలప్రియపై దురుసుగా ప్రవర్తించారన్నారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నెట్టడంతో పాటు, దుర్భాషలాడారని, ఇదేమిటని ప్రశ్నించినందుకు భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. కన్నకూతురిని దుర్భాషలు ఆడితే..తండ్రిగా ఆయన స్పందించారని, ఆ సమయంలో భూమా నాగిరెడ్డిని అక్కడ నుంచి పక్కకు నెట్టేశారని, దాంతో ఆయన తనను నెట్టొద్దంటూ డోంట్ టచ్ మీ అన్నారని, ఆ పదాన్ని తీసుకుని భూమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చివరకు ఆయనకు బెయిల్ కూడా రాకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అసలే భూమానాగిరెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించినా..కక్ష గట్టి కర్నూలులోనే ఉంచారన్నారు. అదేమంటే హైదరాబాద్ వేరే రాష్ట్రం అంటున్నారని, మరి చంద్రబాబుకు అక్కడే నివాసం ఉందని, ఓటర్, ఆధార్‌కార్డు కూడా హైదరాబాద్‌లోనే ఉందని, అలాంటప్పుడు అది వేరే రాష్ట్రమన్నవిషయం గుర్తు రాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

6 July 2015

రుణంలేదు.. పంటల బీమాలేదు

 ఏపీలో రైతన్న దీనస్థితి
  అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు తలెత్తి పంటలకు నష్టం వాటిల్లితే రైతన్నలను పంటల బీమా పథకం ఆదుకుంటుంది. మొత్తం కాకపోయినా జరిగిన నష్టంలో సింహభాగం తిరిగివస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఇపుడు పంటల బీమా లేనట్లేనని చెప్పాలి. రుణమాఫీ మాయలో మోసపోయిన రైతులు బ్యాంకులకు రుణాలు పూర్తిగా చెల్లించలేకపోయారు. డిఫాల్టర్లుగా మారారు. దాంతో డిఫాల్టర్లయిన రైతులకు బ్యాంకులు రుణాలివ్వని పరిస్థితి. రాష్ర్టంలో ఈ సీజన్‌లో 14శాతం మందికి మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. రుణాలు తీసుకున్న రైతుల వద్ద బ్యాంకులు బీమా ప్రీమియంను మినహాయించి పంటల బీమా సదుపాయాన్ని కల్పించాయి. మిగిలినవారికి రుణమూ లేదు.. పంటల బీమా కూడా లేదు. రాష్ర్టంలో రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంటకు, గుంటూరులో పత్తి, మిర్చి, ప్రకాశంలో పత్తి, పశ్చిమగోదావరిలో ఆయిల్‌పామ్, కడపలో బత్తాయి, చిత్తూరులో టమాటా పంటలకు వాతావరణ బీమా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. వేరుశనగకు వాతావరణ బీమా ప్రీమియం గడువు ఈనెల 9తో ముగియనుండగా మిగిలిన పంటలకు ఈనెల 31తో గడువు ముగియనున్నది. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదు. గతేడాది బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించకపోవడంతో 55శాతం మందికి పైగా రైతులకు బీమా పథకం అందకుండాపోయింది. రైతు రుణ  మాఫీ హామీ నీరుగారిపోవడంతో రైతులను బ్యాంకులు డిఫాల్టర్ల (ఎగవేతదారుల) జాబితాలో చేర్చాయి. ఈ జాబితాలో ఉన్న రైతులకు తిరిగి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడంలేదు. రుణం రీషెడ్యూలు చేసుకోని రైతులకూ బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ర్టంలో 14 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు అందాయి. మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

4 July 2015

బాధిత కుటుంబాల్లో జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాల్లో జరిపిన మూడురోజుల పర్యటన ఫలప్రదమయ్యింది. బాధిత కుటుంబాలలో భరోసా కలిగించింది. ప్రతి మృతుని ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు. జగన్ పరామర్శ తమలో స్థయిర్యాన్ని నింపిందని బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. పర్యటన ఆద్యంతం ఎక్కడికక్కడ జనం బారులు తీరి జగన్‌ను పలుకరించేందుకు, జగన్ చేయిని తాకేందుకు పోటీపడ్డారు. 22 మంది ఒక రోడ్డుప్రమాదంలో మరణించి 18 గడిచిపోయినా పరిహారం అందించకపోవడంపై జగన్ మండిపడ్డారు. వెంటనే పరిహారం అందజేయకపోతే కలెక్టరేట్ వద్ద తానే ధర్నా చేస్తానని హెచ్చరించడంతో అచ్యుతాపురం ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ర్టప్రభుత్వం ఆగమేఘాల మీద పరిహారాన్ని అందించింది. తాను రాకపోతే అసలు పరిహారం ఇవ్వలేదన్న విషయం కూడా తెలిసేది కాదని జగన్ సరిగ్గానే చెప్పారని దీన్ని బట్టి అర్ధమౌతోంది.

 బాధిత కుటుంబాలకు అండగా..
 తొలిరోజు పర్యటనలో అచ్యుతాపురం చేరుకున్న జగన్ ఇటీవల రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జివద్ద వాహనం నదిలో పడి 22 మంది  మరణించిన ఘటనకు సంబంధించి వారి బంధువులను పరామర్శించారు. పబ్లిసిటీ ఉంటేనే చంద్రబాబు పరామర్శకు వస్తున్నారని, ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటిస్తున్నారని జగన్ ద్దేవా చేశారు. పబ్లిసిటీ రాదనుకుంటే చంద్రబాబు రావడం లేదని, మంత్రులు వచ్చినా అరకొరగా లక్షో, రెండు లక్షలో పరిహారం ప్రకటించి వెళ్తున్నారని, ఆ తర్వాత ఆ కుటుంబాలు ఏమయ్యాయో పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. తుని నియోజకవర్గం లోని కొత్తపట్నం, రామన్నపాలెం గ్రామాల్లో వేటకు వెళ్లి మృతి చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఆ తర్వాత కాకినాడలోని పరాడపేటలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుని కుటుంబాన్ని ఓదార్చారు. కాకినాడ రూరల్ పరిధిలోని ఉప్పలంక, పగడాలపేట గ్రామంలో పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై మరణించిన కుటుంబాలవారిని జగన్ పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో పొగాకు రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 వర్షాన్ని లెక్కచేయని అభిమానం
 అచ్యుతాపురంలో విపరీతమైన ఉక్కపోత వాతావరణం ఉంది. అయితే జగన్ అక్కడకు చేరుకునేసరికి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది. అప్పటివరకు ఇళ్లలో ఉండిపోయిన జనం జగన్ రాగానే ఆయన్ను చూడడానికి పోటెత్తారు. దాదాపు అరగంటపాటు వర్షం కురుస్తున్నా తడుస్తూనే నినాదాలు చేస్తూ నిల్చున్నారు. జగన్ కూడా వర్షంలో తడుస్తూనే మృతుల కుటుంబాలను పరామర్శించారు.

 జగన్ అల్టిమేటమ్‌తో దిగివచ్చిన ప్రభుత్వం
 ‘‘ 22 మంది మరణించి 18రోజులు గడుస్తున్నా పట్టించుకోరా... రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటారా...? ధవళేశ్వరం ప్రమాదాన్ని ఓపెను విపత్తుగా పరిగణించి మృతులు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి’’ అని జగన్ రాష్ర్టప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు. నాలుగురోజుల్లో బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయకుంటే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. దాంతో రాష్ర్టప్రభుత్వం కదిలివచ్చింది. అధికార యంత్రాంగాన్ని ఆగమేఘాలపై పరుగులుపెట్టించింది. జగన్ పర్యటన పూర్తి కాకుండానే ఆయన చెప్పిన గడువు లోపుగానే పరిహారం అందజేయడం గమనార్హం. జగన్ పర్యటించకపోయి ఉంటే బాధిత కుటుంబాలను వారి మానాన వారిని వదిలివేసి ఉండేవారు. అంత్యక్రియల సమయంలో వచ్చిన అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన వెంకులు జగన్‌కు వివరించాడు. అయితే జగన్ పర్యటన మూలంగా అధికారులు వచ్చి ఆయనకు పరిహారం అందించి వెళ్లారు.

 కరప్షన్ మహారాజు చంద్రబాబు
 రెండు తెలుగురాష్ట్రాలలో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ఈ పర్యటనలో జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు.  ‘‘అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొంటున్న కరప్షన్ మహారాజు చంద్రబాబు’’ అని విమర్శించారు. రాష్ర్టంలో అవినీతి సొమ్ము సంపాదించి రు.100 కోట్ల నుంచి 150 కోట్లతో పక్కరాష్ర్టంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, తప్పు చేసి దొరికిపోయిన తర్వాత సెక్షన్ 8 అంటూ వివాదాలు సృష్టిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ‘‘ఈ రాష్ర్టంలో సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు. పట్టపగలు డబ్బుతో ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. ఆ మర్నాడే విజయవాడ వచ్చి అవినీతి రహిత రాష్ర్టం చేస్తానంటూ చిన్న పిల్లలతో ప్రమాణం చేయిస్తాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉందా? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు’’ అని విమర్శించారు.

 కాకినాడ సెజ్ భూములపై అబద్దాలు
 కాకినాడ సెజ్ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు ఎన్నికల ముందు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశారు. వాటన్నిటికీ ఈ పార్యటనతో జగన్ జవాబు చెప్పారు. కాకినాడ సెజ్ భూముల గురించి అక్కడి జనం జగన్‌కు అర్జీ ఇచ్చారు. జగన్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘కాకినాడ సెజ్‌కు 2002లో జీవో ఇచ్చింది చంద్రబాబే. కానీ ఎన్నికల ముందు ఆ భూముల్లో ఏరువాక సాగించారు. ఆ భూములన్నీ జగన్‌వే నని చెప్పారు. ఇపుడు నేనే చెబుతున్నా.. ఈ భూములన్నీ రైతులకు వెనక్కి ఇచ్చేయండి చంద్రబాబూ... రైతులకు ఎకరాకు రు.3 లక్షలిచ్చి ఇపుడు ఎకరా రు.70 లక్షలకు అమ్ముకుంటున్నారు. రైతుకు రు.70 లక్షలు ఇవ్వండి లేదా భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా’’ అని జగన్ డిమాండ్ చేశారు. దాంతో జరిగిన మోసం ఏమిటో జనానికి స్పష్టంగా అర్ధమయ్యింది. నేరం చేసిన చంద్రబాబు ఆ నేరాన్ని పక్కవారిపై రుద్ది ఎలాంటి బూటకపు ప్రచారాలు చేస్తారో బాగా తెలిసివచ్చింది.

 మత్స్యకార కుటుంబాలకు బాబు అన్యాయం
 వాయుగుండం వల్ల సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను కూడా చంద్రబాబు వదల్లేదు. వారికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా విషయంలో చంద్రబాబు అదేవిధంగా మోసాలు చేస్తున్నాడు. 60 రోజుల పాటు వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సెలవు దినాలుగా ప్రకటించారు. ఆరోజులకు మత్స్యకారులందరికీ 50 కేజీల బియ్యం, రు. నాలుగువేలు ఇస్తానన్నాడు. 40 మంది మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైతే హెలికాప్టర్లు పెట్టి వెతికిస్తామన్నారు. వారిలో 17 మంది చనిపోగా మిగిలినవారు కొన ఊపిరితో ఇంటికి చేరారు. వారికి ఇప్పటివరకు దమ్మిడీ ఇచ్చిన పాపాన పోలేదు. ఈ విషయాలను జగన్ గుర్తించడమే కాక జనానికి అర్ధమయ్యేలా వివరించారు. సముద్రంలో గల్లంతైన బోట్లను వెతికేందుకు తుని ఎమ్మెల్యే రాజా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బోట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి న్యాయం చేస్తామన్నారు. మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి ప్రయత్నిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

 పొగాకు  మద్దతు ధర పైనా జగన్ అల్టిమేటమ్
 పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో జగన్ భేటీ అయ్యారు. ఇటీవలే ఇక్కడి పొగాకు రైతులు హైదరాబాద్ వచ్చి జగన్‌ను కలుసుకుని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారివద్దకు వస్తానని జగన్ వారికి మాట ఇచ్చారు. అన్నట్లుగానే ఆ రైతులను వారి ఊరిలో కలుసుకున్నారు. పొగాకు రైతుల సమస్యలపై కూలంకషంగా చర్చించారు. పొగాకుకు కిలో రు.150కి తగ్గకుండా మద్దతు ధర కల్పించి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్లు చేయించని పక్షంలో ఈనెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ అల్టిమేటమ్ జారీ చేశారు. రైతులను నట్టేట ముంచేస్తోందని, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఆయన మండిపడ్డారు. పొగాకును గతంలో 120 రోజుల కొనుగోలు చేసేవారని, ఇపుడు దాన్ని 80 రోజులకే పరిమితం చేశారని జగన్ అన్నారు. వెంటనే మద్దతుధర కల్పించి కొనుగోళ్లు జరిపించాలని రాష్ర్టప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పర్యటనతో తమ సమస్యలపై రాష్ర్టప్రభుత్వం దృష్టిపెడుతుందన్న నమ్మకం ఏర్పడిందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. తమ సమస్యలపై పోరాడతానని జగన్ హామీ ఇవ్వడం కొండంత బలాన్నిచ్చిందని రైతులు అంటున్నారు.

ప్రతిపక్షాల్ని వే ధించటమే తెలుగుదేశం విధానం

ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా తెలుగుదేశం పార్టీ మరోసారి రెచ్చిపోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నాయకుల్ని వేధించేందుకు కంకణం కట్టుకొంది. పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమ కేసులు పెట్టి  అరెస్టు చేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, తాకవద్దని తనను అవమానించారంటూ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమాపై 353, 188, 506 ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను ఇంటివద్ద అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

 వాస్తవంగా జరిగింది ఇది..! 
  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే  అఖిలప్రియ, పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి పోలింగ్  కేంద్రమైన ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి వెయిటింగ్ స్టాల్‌లో కూర్చున్నారు.   ఇంతలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ  హరినాథరెడ్డి, ఎన్నికల జోనల్ అధికారి వెంకటేశంలు  అక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రంలోకి  వెళ్లి ఓటు వేయమని కోరగా, నాన్న వచ్చాక వెళ్తానని అఖిలప్రియ సమాధానం ఇచ్చారు. డీఎస్పీ కోపోద్రిక్తుడై వెయిటింగ్ స్టాల్ లో కూర్చుంటే ఓటర్లను ప్రభావితం చేసినట్లేనని అనడంతో... వీరిద్దరి మధ్యన వాగ్వాదం  జరిగింది. దీంతో  ఆమె పోలింగ్ కేంద్రం వెలుపలకు వెళ్లారు.

 భూమాపై కేసు నమోదుకు వ్యూహం..
 అఖిలప్రియకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న భూమా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానంలను  నిలదీశారు. సీఐ  ప్రభాకర్‌రెడ్డి మరి కొందరు పోలీస్ అధికారులు, రిటర్నింగ్  అధికారి సర్దిచెప్పడంతో ఆయన శాంతించారు. మరోవైపు ఎన్నికల, పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్లి భూమాపై కేసు నమోదు చేయాడానికి వ్యూహం పన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల ద్వారా  పోలీస్ అధికారులపై  ఒత్తిడి  తేవడంతో కేసు నమోదు అయ్యింది. అరెస్టు నందర్భంలో ఉద్రిక్తత  చోటుచేసుకుంది.  వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించారు.

 భూమా వ్యాఖ్యలకు కులం రంగు...
 ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు మేరకు త్రీటౌన్  ఎస్‌ఐ సూర్యమౌళి భూమాపై అట్రాసిటీ, నాన్‌బెయిలబుల్  కేసులను ( ఎఫ్‌ఐఆర్ నెం. 132-2015) నమోదు చేశారు. ఇది కావాలని చేసిన కుట్ర అని స్పష్టంగా అర్థం అవుతున్నా, అధికార పక్షం ఒత్తిడి మేరకే ఇలా చేశారని తెలుస్తోంది. పైగా పోలింగ్ స్టేషన్ దగ్గర తన కుమార్తె తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలుసుకొన్న వెంటనే ఉద్వేగంతో అక్కడకు చేరుకొన్న భూమాను ఇరికించేందుకే రెచ్చగొట్టేలా ప్రవర్తించారని అర్థం అవుతోంది. అందుకే పోలీసులు, అధికారపక్షంతో చేతులు కలిపి ఈ కుట్రకు తెర తీసినట్లు తెలుస్తోంది.

 నాన్నపై కక్ష సాధింపు
 పోలింగ్ బూత్ దగ్గర తనను పోలీసులు దూషించారని ఎమ్మెల్యే అఖిల ప్రియ వెల్లడించారు. పోలింగ్ బూత్ దగ్గర జరిగిన ఘటనల్ని ఆమె మీడియాకు వివరించారు. పోలింగ్ స్టేషన్ లో ఓటు వేసేందుకు తాను వెళ్లినప్పుడు పోలీసులు గదమాయించే ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు. పది నిముషాల్లో ఓటు వేసి వెళతానని చెప్పినప్పటికీ వినకుండా వెంటనే ఓటు వేసి వెళ్లాలని పట్టు పట్టారని ఆమె అన్నారు. ఈలోగా డీఎస్పీ వచ్చి రూడ్ గా మాట్లాడిన సందర్భాన్ని అఖిల ప్రియ ఉదహరించారు. కూతురు ఒక్కతే ఉన్నప్పుడు పోలీసులు రూడ్ గా మాట్లాడితే ఒక తండ్రిగా రియాక్టు అయ్యారని అమె అన్నారు. సిల్లీ రీజన్సుతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె అన్నారు. ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని అఖిల ప్రియ అభివర్ణించారు.

 మెరుగైన వైద్యం నిరాకరణ
 చాతీ నొప్పి తో బాధపడుతున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కి పోలీసుల సమక్షంలో వైద్య పరీక్షలు జరిగాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అయినప్పటికీ పోలీసు అధికారుల మీద అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొని వచ్చారు. దీంతో ఎస్కార్టు పోలీసులు అందుబాటులో లేరంటూ తరలింపు ను వాయిదా వేస్తూ వచ్చారు. ఇదంతా కావాలని పోలీసులు చేస్తున్న హైడ్రామా అని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు.

3 July 2015

అవినీతి చేస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు

 ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదు?
 వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి
  కాకినాడ: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చేసి సంపాదించిన డబ్బును తెలంగాణలో బేరసారాలకు ఉపయోగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది.
  ఓటుకు కోట్లు కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి ఆడియో, వీడియో సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదో అర్ధం కావడం లేదని జగన్ పేర్కొన్నారు. సెక్షన్ 8 ముసుగులో చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారని జగన్ విమర్శించారు. ఎన్‌డీ తివారీకి ఒక న్యాయం చంద్రబాబుకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న లంచాలతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయన ఇలా అన్నారు... ‘‘సెక్షన్ 8 అనే టాపిక్‌ని చంద్రబాబు ఇవాళ ఎందుకు ముందుకు తీసుకువచ్చాడంటే టాపిక్‌ను డైవర్ట్ చేయడం కోసం. టాపిక్ డైవర్షన్ ఎందుకంటే నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకున్న డబ్బును పక్కరాష్ర్టంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం ఇస్తూ పట్టుబడిన పరిస్థితి రాష్ర్ట చరిత్రలోనే కాదు బహుశా దేశచరిత్రలోనే ప్రథమం కావచ్చు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఐదు కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇవ్వడానికి నేరుగా సంభాషణలు జరిపాడు. వీడియో రికార్డులు ఉన్నాయి. ఆడియో రికార్డులు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 నుంచి 20 కోట్లంటే దాదాపుగా 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వీడియో టేపులు దొరికాయి. ఇంత పబ్లిగ్గా అవినీతికి పాల్పడిన చంద్రబాబుని ఇంకా అరెస్టు చేయకపోవడం బాధనిపించే విషయం. ఎన్‌డీ తివారీ పట్టుబడినపుడు కథలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని చంద్రబాబు ఎంత రక్షించాడో తెలిసిన విషయమే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చాలా గొప్పది... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం.. అని చంద్రబాబు ప్రచారం చేశాడు. ఎన్‌డీ తివారీ చేసింది చాలా అన్యాయం.. తివారీ పదవిలో ఉండగా ఇలాంటివి చేయడం చాలా దుర్మార్గం.. ఆయన వెంటనే తప్పుకోవాలి అని చంద్రబాబు డిమాండ్ చేశాడు. ఇదే చంద్రబాబు ఇవాళ అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోతే ఇదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నా.. ఆరోజు నీతులు చెప్పిన చంద్రబాబు ఆ నీతులు తనకు వర్తించవని అనుకుంటున్నారా..?  ఒక ముఖ్యమంత్రి 150 కోట్ల రూపాయల బ్లాక్‌మనీతో అవినీతి చేస్తూ సాక్ష్యాలతో సహా పట్టుబడినా పదవిలో కొనసాగే హక్కు, నైతిక అర్హత ఎక్కడ ఉంటాయి.... అని అడుగుతున్నా..’’ అని జగన్ అన్నారు..
 మత్స్యకార కుటుంబాలకు బాబు సర్కార్ చేసిందేమీ లేదు..
 తుఫాన్ కారణంగా మరణించిన మత్స్యకారుడు పి.వెంకటేశ్వరరావు కుటుంబాన్ని శుక్రవారం పర్లోపేటలో జగన్‌మోహన్ రెడ్డి  పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరణించి ఇన్ని రోజులైనా మత్స్యకారుల కుటుంబాలకు రాష్ర్ట ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మత్స్యకారుల ప్రాణాలనున చంద్రబాబే తీశారని, వాతావరణ పరిస్థితులపై కనీసం హెచ్చరికలు కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఎలాంటి సాయం అందడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
 అందరికీ ఒకేరకమైన పరిహారం ఉండాలి
 రాష్ర్టంలో ప్రమాద వశాత్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఎవరికైనా సరే ఒకే రకమైన పరిహారం ఉండాలని జగన్ డిమాండ్ చేశారు. పబ్లిసిటీ వస్తుందంటే స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించడం.. పబ్లిసిటీ రాదనుకుంటే మంత్రులు వచ్చి తూతూ మంత్రంలా రెండు లక్షలు , లక్ష పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. పరిహారాన్ని ప్రకటించడమే గానీ ఆ తర్వాత అసలు ఎవరూ వచ్చి పలకరించే పాపాన పోవడం లేదని, బాధితులను ఆదుకోవడానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున ఎవరూ రావడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ మారాలని, రాష్ర్టంలో ఎక్కడ ఎవరు ప్రమాద వశాత్తూ ప్రాణాలు కోల్పోయినా ఐదు లక్షల పరిహారాన్ని అందించాల్సిందేనని, చంద్రబాబు వచ్చినా రాకపోయినా అందరికీ ఒకేవిధమైన పరిహారం అందేలా చూడాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. అందుకోసం రాష్ర్టప్రభుత్వంపై తాము తీవ్రంగా వత్తిడి తీసుకువస్తామని, అందరినీ ఆదుకునేలా చూస్తామని మత్స్యకార కుటుంబాలకు జగన్ హామీ ఇచ్చారు.

2 July 2015

చంద్రబాబు అవినీతి మహారాజు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

విశాఖపట్నం:  రాష్ట్ర ప్రభుత్వానికి పబ్లిసిటీ కావాలి తప్పితే ప్రజల అవసరాలు పట్టడం లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ప్రజల అవసరాలు పట్టించుకోవటం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్‌పర్యటించారు.
  మొదటగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకొని అక్కడ నుంచి రోడ్‌మార్గంలో ఎలమంచిలి నియోజక వర్గంలోని అచ్యుతాపురం చేరుకొన్నారు. ఇటీవల కాలంలో ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిలోకి వాహనం బోల్తా కొట్టిన ఘటనలో 22 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబంలో పుట్టెడు శోకం నెలకొంది. బాధితుల్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.ఈ ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా ఇప్పటిదాకా పరిహారం ఇవ్వలేదని జగన్ మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అందలేదని ఆయన అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి 22మంది చనిపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి పలకరించలేదని ఆయన గుర్తు చేశారు. మంత్రులు వచ్చి హడావుడిగా మీడియా ముందు పబ్లిసిటీ కోసం ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని, కానీ ఇందులో ఒక్క దమ్మిడీ కూడా విదల్చలేదని అభిప్రాయ పడ్డారు. ఇప్పటి దాకా ఎందుకు పరిహారం ఇవ్వలేదు, ఎందుకిలా మోసం చేస్తున్నారని వైఎస్ జగన్ నిలదీశారు. అప్పుడు మంత్రులు వచ్చి పబ్లిసిటీ కోసం సాయం చేస్తామంటూ ప్రకటనలు చేశారని, కానీ తర్వాత మాత్రం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కార్యక్రమం ఉంటే చంద్రబాబు వెళ్లి అక్కడ రూ. 5లక్షలు అందిస్తారని, వీళ్లు కూడా మనుషులే అని, కానీ రూ. 5లక్షలు ఎందుకు ప్రకటించలేదని ్రపశ్నించారు. వాళ్లకు ఇష్టం లేదంటే మాత్రం పరిహారం కూడా తగ్గిస్తారు, లేదంటే అస్సలు ఇవ్వనే ఇవ్వరని ఆయన అన్నారు. రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు కానీ ఒక్క రూపాయి  కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం దారుణంగా పనిచేస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు.  నాలుగు రోజులు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నాలుగు రోజుల్లో సహాయం అందించక పోతే ధర్నా కార్యక్రమం చేపడతామని అన్నారు. కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక్కడకు రాబట్టి కనీసం వీళ్లకు సాయం అందలేదన్న విషయం తె లిసిందని జగన్ అన్నారు.

 హత్య చేయటం తప్పు కాదు కానీ, వీడియో తీయటం తప్పా..!
 అనంతరం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు బయలు దేరారు. మార్గ మధ్యలో పాయకరావు పేట నియోజకవర్గం లోని నక్కపల్లి దగ్గర ఆగారు. పార్టీ నేతలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబురావులతో స్థానికపరిస్థితుల గురించి మాట్లాడారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై స్పందించారు. ఒక వ్యక్తిని హత్య చేయటం తప్పు కాదు కానీ, ఆ హత్యను ఎవరైనా వీడియో తీస్తే వీడియో తీయటం తప్పని చంద్రబాబు ఆంటున్నారని వైఎస్‌జ గన్ అన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్-8 అనేది ఒక అంశం మాత్రమే అని, తాను తప్పు చేసిన తర్వాత చంద్రబాబు కు ఆ సెక్షన్ గురించి గుర్తుకొచ్చినట్లుందని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యం గా ఉండాలని కోరుకొన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విభజనకు మొట్టమొదటిసారిగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఓటేసి మద్దతు తెలిపారు. ఆ రోజు చంద్రబాబు కు సిగ్గులేదు..బుద్ది లే దు. చాలా స్పష్టంగా రాష్ట్ర విభజనకు చంద్రబాబు పాలు పంచుకొన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో రాజకీయంగా మేం ఏ పార్టీకి మద్దతు ఇస్తే చంద్రబాబుకి ఎందుకు..! రాజకీయం కోసం ప్రజలను తప్పు దోవ పట్టించడం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజల్ని తప్పు దారి పట్టించేందుకే ఈ సెక్షన్ - 8 మీద రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. లంచాలు తీసుకొన్న డబ్బులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారని జగన్ అన్నారు. కరప్షన్ మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు.
 తూ.గో. జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
 అనంతరం వైఎస్ జగన్ రోడ్డు మార్గం గుండా తూర్పు గోదావరి జిల్లాలో అడుగు పెట్టారు. అక్కడ తుని నియోజకవర్గం లోని తొండంగి మండలం పెరుమాళ్లపాలెం, హుకుంపేట, కొత్తపట్నం, రామన్న పాలెం గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల కాలంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి అక్కడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. 

పొగాకు రైతులపై కనికరం లేదా? కష్టకాలంలో చేతులెత్తేసిన చంద్రబాబు

మద్దతు ధర లేక, కొనుగోళ్లు జరక్క పొగాకు రైతులు విలవిల్లాడుతున్నారు. అన్నదాత సంక్షేమం గురించి అనర్గళమైన ఉపన్యాసాలు దంచే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు రైతుల గురించి అసలు పట్టించుకోవడమే లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులను సాకుగా చూపుతూ పొగాకు బోర్డు చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా నీళ్లు నములుతోంది. చంద్రబాబు సర్కారు ఆదుకోవడానికి బదులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు రోడ్డునపడుతున్నారు. రహదారులను దిగ్బంధించి పంటను తగులబెట్టి తమ నిరసనను తెలియజేస్తున్నారు.
  మన రాష్ర్టంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకును విరివిగా పండిస్తున్నారు. జూన్ నెలాఖరుకు 80 నుంచి 90శాతం వరకు పొగాకు అమ్మకాలు జరగాల్సి ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 25శాతం కూడా అమ్మకాలు జరగలేదు. రాష్ర్టంలోని ఈ ఐదు జిల్లాల నుంచి 172 మిలియన్ కిలోల వర్జీనియా పొగాకును కొనుగోలు చేయాలని పొగాకు బోర్డు అధికారికంగా నిర్ణయించుకుంది. అయినా ఇప్పటి వరకు 45 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేసింది. గత ఏడాది సగటున కిలోకి రు.118.90 పలుకగా ఇపుడు రు.80 కూడా లేకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు రాష్ర్ట ప్రభుత్వమే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలి. కొనుగోళ్లు జరిగేలా చూడడం, కనీస మద్దతు ధర లభించేలా చూడడం ప్రభుత్వ బాధ్యత. కానీ చంద్రబాబు సర్కారు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. కనీసం పరిస్థితిని కేంద్రానికి వివరించి పొగాకు రైతును ఆదుకునేలా వత్తిడి కూడా చేయకపోవడం చంద్రబాబు మార్కు నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతుల నుంచి వివిధ రూపాలలో వసూలు చేసిన సుమారు. రు.500 కోట్లు బోర్డు వద్ద మూలుగుతున్నాయి. కనీసం ఆ నిధులతోనైనా పొగాకును బోర్డు నేరుగా కొనుగోలు చేసేతా వత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రికి రైతులు మొరపెట్టుకుంటున్నా చెవిటివాని ముందు శంఖమూదిన చందంలా మారింది.

 సంక్షోభసమయంలో ఆదుకున్న వైఎస్
 {పజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా 2003 చివర్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే 2004లో సంక్షోభ నివారణకు చర్యలు చేపట్టారు. వ్యాపారులంతా కుమ్మక్కై ధర పెరగకుండా చేస్తున్న తరుణంలో పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్యలను, కోల్ సొసైటీలను రంగంలోకి దింపారు. ఈ సంస్థలకు రు.10 కోట్ల రుణమిచ్చి పొగాకు కొనుగోలు చేయించారు. వరుసగా రెండేళ్లు ఈ విధంగా చేయడంతో ఓ దశలో కిలో పొగాకు ధర రు.199కి కూడా చేరింది. దాంతో పోటీ పెరిగి పొగాకు కంపెనీలు అనివార్యంగా కొనాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తికి ఇలాంటి సమగ్ర దృష్టి, సమస్యల పట్ల అవగాహన, ఆదుకునే మనస్తత్వం ఉండాలి. కానీ చంద్రబాబుకు అవేవీ లేకపోవడమే సమస్య. అందుకే ఆయన ఢిల్లీపై భారం వేసి చేతులెత్తేశారు.