7 July 2015

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓట్లకు కోట్లు


కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓట్లకు కోట్లు కురిపించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ విలువలకు పాతర వేసిన చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. లంచాల సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేశారని, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లకు కోట్లు గుమ్మరించారన్నారు. అధికారాన్ని  అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరించారని, తప్పు చేసి తిరిగి వాళ్లే కేసులు పెట్టారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కర్నూలు లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూమానాగిరెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించినా..కక్ష గట్టి కర్నూలులోనే ఉంచారన్నారు. అదేమంటే హైదరాబాద్ వేరే రాష్ట్రం అంటున్నారని, మరి చంద్రబాబుకు అక్కడే నివాసం ఉందని, ఓటర్, ఆధార్‌కార్డు కూడా హైదరాబాద్‌లోనే ఉందని, అలాంటప్పుడు అది వేరే రాష్ట్రమన్నవిషయం గుర్తు రాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

 డోన్ట్ టచ్ మీ అంటే  ఎట్రాసిటీ కేసు పెట్టేస్తారా..!
 కర్నూలు) పభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని  వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డిపై కుట్ర చేసి కేసు పెట్టారని, ఎమ్మెల్యే అఖిలప్రియపై దురుసుగా ప్రవర్తించారన్నారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నెట్టడంతో పాటు, దుర్భాషలాడారని, ఇదేమిటని ప్రశ్నించినందుకు భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. కన్నకూతురిని దుర్భాషలు ఆడితే..తండ్రిగా ఆయన స్పందించారని, ఆ సమయంలో భూమా నాగిరెడ్డిని అక్కడ నుంచి పక్కకు నెట్టేశారని, దాంతో ఆయన తనను నెట్టొద్దంటూ డోంట్ టచ్ మీ అన్నారని, ఆ పదాన్ని తీసుకుని భూమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చివరకు ఆయనకు బెయిల్ కూడా రాకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అసలే భూమానాగిరెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించినా..కక్ష గట్టి కర్నూలులోనే ఉంచారన్నారు. అదేమంటే హైదరాబాద్ వేరే రాష్ట్రం అంటున్నారని, మరి చంద్రబాబుకు అక్కడే నివాసం ఉందని, ఓటర్, ఆధార్‌కార్డు కూడా హైదరాబాద్‌లోనే ఉందని, అలాంటప్పుడు అది వేరే రాష్ట్రమన్నవిషయం గుర్తు రాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

6 July 2015

రుణంలేదు.. పంటల బీమాలేదు

 ఏపీలో రైతన్న దీనస్థితి
  అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు తలెత్తి పంటలకు నష్టం వాటిల్లితే రైతన్నలను పంటల బీమా పథకం ఆదుకుంటుంది. మొత్తం కాకపోయినా జరిగిన నష్టంలో సింహభాగం తిరిగివస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఇపుడు పంటల బీమా లేనట్లేనని చెప్పాలి. రుణమాఫీ మాయలో మోసపోయిన రైతులు బ్యాంకులకు రుణాలు పూర్తిగా చెల్లించలేకపోయారు. డిఫాల్టర్లుగా మారారు. దాంతో డిఫాల్టర్లయిన రైతులకు బ్యాంకులు రుణాలివ్వని పరిస్థితి. రాష్ర్టంలో ఈ సీజన్‌లో 14శాతం మందికి మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. రుణాలు తీసుకున్న రైతుల వద్ద బ్యాంకులు బీమా ప్రీమియంను మినహాయించి పంటల బీమా సదుపాయాన్ని కల్పించాయి. మిగిలినవారికి రుణమూ లేదు.. పంటల బీమా కూడా లేదు. రాష్ర్టంలో రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంటకు, గుంటూరులో పత్తి, మిర్చి, ప్రకాశంలో పత్తి, పశ్చిమగోదావరిలో ఆయిల్‌పామ్, కడపలో బత్తాయి, చిత్తూరులో టమాటా పంటలకు వాతావరణ బీమా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. వేరుశనగకు వాతావరణ బీమా ప్రీమియం గడువు ఈనెల 9తో ముగియనుండగా మిగిలిన పంటలకు ఈనెల 31తో గడువు ముగియనున్నది. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదు. గతేడాది బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించకపోవడంతో 55శాతం మందికి పైగా రైతులకు బీమా పథకం అందకుండాపోయింది. రైతు రుణ  మాఫీ హామీ నీరుగారిపోవడంతో రైతులను బ్యాంకులు డిఫాల్టర్ల (ఎగవేతదారుల) జాబితాలో చేర్చాయి. ఈ జాబితాలో ఉన్న రైతులకు తిరిగి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడంలేదు. రుణం రీషెడ్యూలు చేసుకోని రైతులకూ బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ర్టంలో 14 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు అందాయి. మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

4 July 2015

బాధిత కుటుంబాల్లో జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాల్లో జరిపిన మూడురోజుల పర్యటన ఫలప్రదమయ్యింది. బాధిత కుటుంబాలలో భరోసా కలిగించింది. ప్రతి మృతుని ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు. జగన్ పరామర్శ తమలో స్థయిర్యాన్ని నింపిందని బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. పర్యటన ఆద్యంతం ఎక్కడికక్కడ జనం బారులు తీరి జగన్‌ను పలుకరించేందుకు, జగన్ చేయిని తాకేందుకు పోటీపడ్డారు. 22 మంది ఒక రోడ్డుప్రమాదంలో మరణించి 18 గడిచిపోయినా పరిహారం అందించకపోవడంపై జగన్ మండిపడ్డారు. వెంటనే పరిహారం అందజేయకపోతే కలెక్టరేట్ వద్ద తానే ధర్నా చేస్తానని హెచ్చరించడంతో అచ్యుతాపురం ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ర్టప్రభుత్వం ఆగమేఘాల మీద పరిహారాన్ని అందించింది. తాను రాకపోతే అసలు పరిహారం ఇవ్వలేదన్న విషయం కూడా తెలిసేది కాదని జగన్ సరిగ్గానే చెప్పారని దీన్ని బట్టి అర్ధమౌతోంది.

 బాధిత కుటుంబాలకు అండగా..
 తొలిరోజు పర్యటనలో అచ్యుతాపురం చేరుకున్న జగన్ ఇటీవల రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జివద్ద వాహనం నదిలో పడి 22 మంది  మరణించిన ఘటనకు సంబంధించి వారి బంధువులను పరామర్శించారు. పబ్లిసిటీ ఉంటేనే చంద్రబాబు పరామర్శకు వస్తున్నారని, ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటిస్తున్నారని జగన్ ద్దేవా చేశారు. పబ్లిసిటీ రాదనుకుంటే చంద్రబాబు రావడం లేదని, మంత్రులు వచ్చినా అరకొరగా లక్షో, రెండు లక్షలో పరిహారం ప్రకటించి వెళ్తున్నారని, ఆ తర్వాత ఆ కుటుంబాలు ఏమయ్యాయో పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. తుని నియోజకవర్గం లోని కొత్తపట్నం, రామన్నపాలెం గ్రామాల్లో వేటకు వెళ్లి మృతి చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఆ తర్వాత కాకినాడలోని పరాడపేటలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుని కుటుంబాన్ని ఓదార్చారు. కాకినాడ రూరల్ పరిధిలోని ఉప్పలంక, పగడాలపేట గ్రామంలో పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై మరణించిన కుటుంబాలవారిని జగన్ పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో పొగాకు రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 వర్షాన్ని లెక్కచేయని అభిమానం
 అచ్యుతాపురంలో విపరీతమైన ఉక్కపోత వాతావరణం ఉంది. అయితే జగన్ అక్కడకు చేరుకునేసరికి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది. అప్పటివరకు ఇళ్లలో ఉండిపోయిన జనం జగన్ రాగానే ఆయన్ను చూడడానికి పోటెత్తారు. దాదాపు అరగంటపాటు వర్షం కురుస్తున్నా తడుస్తూనే నినాదాలు చేస్తూ నిల్చున్నారు. జగన్ కూడా వర్షంలో తడుస్తూనే మృతుల కుటుంబాలను పరామర్శించారు.

 జగన్ అల్టిమేటమ్‌తో దిగివచ్చిన ప్రభుత్వం
 ‘‘ 22 మంది మరణించి 18రోజులు గడుస్తున్నా పట్టించుకోరా... రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటారా...? ధవళేశ్వరం ప్రమాదాన్ని ఓపెను విపత్తుగా పరిగణించి మృతులు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి’’ అని జగన్ రాష్ర్టప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు. నాలుగురోజుల్లో బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయకుంటే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. దాంతో రాష్ర్టప్రభుత్వం కదిలివచ్చింది. అధికార యంత్రాంగాన్ని ఆగమేఘాలపై పరుగులుపెట్టించింది. జగన్ పర్యటన పూర్తి కాకుండానే ఆయన చెప్పిన గడువు లోపుగానే పరిహారం అందజేయడం గమనార్హం. జగన్ పర్యటించకపోయి ఉంటే బాధిత కుటుంబాలను వారి మానాన వారిని వదిలివేసి ఉండేవారు. అంత్యక్రియల సమయంలో వచ్చిన అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన వెంకులు జగన్‌కు వివరించాడు. అయితే జగన్ పర్యటన మూలంగా అధికారులు వచ్చి ఆయనకు పరిహారం అందించి వెళ్లారు.

 కరప్షన్ మహారాజు చంద్రబాబు
 రెండు తెలుగురాష్ట్రాలలో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ఈ పర్యటనలో జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు.  ‘‘అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొంటున్న కరప్షన్ మహారాజు చంద్రబాబు’’ అని విమర్శించారు. రాష్ర్టంలో అవినీతి సొమ్ము సంపాదించి రు.100 కోట్ల నుంచి 150 కోట్లతో పక్కరాష్ర్టంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, తప్పు చేసి దొరికిపోయిన తర్వాత సెక్షన్ 8 అంటూ వివాదాలు సృష్టిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ‘‘ఈ రాష్ర్టంలో సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు. పట్టపగలు డబ్బుతో ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. ఆ మర్నాడే విజయవాడ వచ్చి అవినీతి రహిత రాష్ర్టం చేస్తానంటూ చిన్న పిల్లలతో ప్రమాణం చేయిస్తాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉందా? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు’’ అని విమర్శించారు.

 కాకినాడ సెజ్ భూములపై అబద్దాలు
 కాకినాడ సెజ్ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు ఎన్నికల ముందు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశారు. వాటన్నిటికీ ఈ పార్యటనతో జగన్ జవాబు చెప్పారు. కాకినాడ సెజ్ భూముల గురించి అక్కడి జనం జగన్‌కు అర్జీ ఇచ్చారు. జగన్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘కాకినాడ సెజ్‌కు 2002లో జీవో ఇచ్చింది చంద్రబాబే. కానీ ఎన్నికల ముందు ఆ భూముల్లో ఏరువాక సాగించారు. ఆ భూములన్నీ జగన్‌వే నని చెప్పారు. ఇపుడు నేనే చెబుతున్నా.. ఈ భూములన్నీ రైతులకు వెనక్కి ఇచ్చేయండి చంద్రబాబూ... రైతులకు ఎకరాకు రు.3 లక్షలిచ్చి ఇపుడు ఎకరా రు.70 లక్షలకు అమ్ముకుంటున్నారు. రైతుకు రు.70 లక్షలు ఇవ్వండి లేదా భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా’’ అని జగన్ డిమాండ్ చేశారు. దాంతో జరిగిన మోసం ఏమిటో జనానికి స్పష్టంగా అర్ధమయ్యింది. నేరం చేసిన చంద్రబాబు ఆ నేరాన్ని పక్కవారిపై రుద్ది ఎలాంటి బూటకపు ప్రచారాలు చేస్తారో బాగా తెలిసివచ్చింది.

 మత్స్యకార కుటుంబాలకు బాబు అన్యాయం
 వాయుగుండం వల్ల సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను కూడా చంద్రబాబు వదల్లేదు. వారికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా విషయంలో చంద్రబాబు అదేవిధంగా మోసాలు చేస్తున్నాడు. 60 రోజుల పాటు వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సెలవు దినాలుగా ప్రకటించారు. ఆరోజులకు మత్స్యకారులందరికీ 50 కేజీల బియ్యం, రు. నాలుగువేలు ఇస్తానన్నాడు. 40 మంది మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైతే హెలికాప్టర్లు పెట్టి వెతికిస్తామన్నారు. వారిలో 17 మంది చనిపోగా మిగిలినవారు కొన ఊపిరితో ఇంటికి చేరారు. వారికి ఇప్పటివరకు దమ్మిడీ ఇచ్చిన పాపాన పోలేదు. ఈ విషయాలను జగన్ గుర్తించడమే కాక జనానికి అర్ధమయ్యేలా వివరించారు. సముద్రంలో గల్లంతైన బోట్లను వెతికేందుకు తుని ఎమ్మెల్యే రాజా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బోట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి న్యాయం చేస్తామన్నారు. మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి ప్రయత్నిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

 పొగాకు  మద్దతు ధర పైనా జగన్ అల్టిమేటమ్
 పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో జగన్ భేటీ అయ్యారు. ఇటీవలే ఇక్కడి పొగాకు రైతులు హైదరాబాద్ వచ్చి జగన్‌ను కలుసుకుని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారివద్దకు వస్తానని జగన్ వారికి మాట ఇచ్చారు. అన్నట్లుగానే ఆ రైతులను వారి ఊరిలో కలుసుకున్నారు. పొగాకు రైతుల సమస్యలపై కూలంకషంగా చర్చించారు. పొగాకుకు కిలో రు.150కి తగ్గకుండా మద్దతు ధర కల్పించి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్లు చేయించని పక్షంలో ఈనెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ అల్టిమేటమ్ జారీ చేశారు. రైతులను నట్టేట ముంచేస్తోందని, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఆయన మండిపడ్డారు. పొగాకును గతంలో 120 రోజుల కొనుగోలు చేసేవారని, ఇపుడు దాన్ని 80 రోజులకే పరిమితం చేశారని జగన్ అన్నారు. వెంటనే మద్దతుధర కల్పించి కొనుగోళ్లు జరిపించాలని రాష్ర్టప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పర్యటనతో తమ సమస్యలపై రాష్ర్టప్రభుత్వం దృష్టిపెడుతుందన్న నమ్మకం ఏర్పడిందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. తమ సమస్యలపై పోరాడతానని జగన్ హామీ ఇవ్వడం కొండంత బలాన్నిచ్చిందని రైతులు అంటున్నారు.

ప్రతిపక్షాల్ని వే ధించటమే తెలుగుదేశం విధానం

ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా తెలుగుదేశం పార్టీ మరోసారి రెచ్చిపోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నాయకుల్ని వేధించేందుకు కంకణం కట్టుకొంది. పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమ కేసులు పెట్టి  అరెస్టు చేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, తాకవద్దని తనను అవమానించారంటూ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమాపై 353, 188, 506 ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను ఇంటివద్ద అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

 వాస్తవంగా జరిగింది ఇది..! 
  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే  అఖిలప్రియ, పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి పోలింగ్  కేంద్రమైన ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి వెయిటింగ్ స్టాల్‌లో కూర్చున్నారు.   ఇంతలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ  హరినాథరెడ్డి, ఎన్నికల జోనల్ అధికారి వెంకటేశంలు  అక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రంలోకి  వెళ్లి ఓటు వేయమని కోరగా, నాన్న వచ్చాక వెళ్తానని అఖిలప్రియ సమాధానం ఇచ్చారు. డీఎస్పీ కోపోద్రిక్తుడై వెయిటింగ్ స్టాల్ లో కూర్చుంటే ఓటర్లను ప్రభావితం చేసినట్లేనని అనడంతో... వీరిద్దరి మధ్యన వాగ్వాదం  జరిగింది. దీంతో  ఆమె పోలింగ్ కేంద్రం వెలుపలకు వెళ్లారు.

 భూమాపై కేసు నమోదుకు వ్యూహం..
 అఖిలప్రియకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న భూమా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానంలను  నిలదీశారు. సీఐ  ప్రభాకర్‌రెడ్డి మరి కొందరు పోలీస్ అధికారులు, రిటర్నింగ్  అధికారి సర్దిచెప్పడంతో ఆయన శాంతించారు. మరోవైపు ఎన్నికల, పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్లి భూమాపై కేసు నమోదు చేయాడానికి వ్యూహం పన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల ద్వారా  పోలీస్ అధికారులపై  ఒత్తిడి  తేవడంతో కేసు నమోదు అయ్యింది. అరెస్టు నందర్భంలో ఉద్రిక్తత  చోటుచేసుకుంది.  వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించారు.

 భూమా వ్యాఖ్యలకు కులం రంగు...
 ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు మేరకు త్రీటౌన్  ఎస్‌ఐ సూర్యమౌళి భూమాపై అట్రాసిటీ, నాన్‌బెయిలబుల్  కేసులను ( ఎఫ్‌ఐఆర్ నెం. 132-2015) నమోదు చేశారు. ఇది కావాలని చేసిన కుట్ర అని స్పష్టంగా అర్థం అవుతున్నా, అధికార పక్షం ఒత్తిడి మేరకే ఇలా చేశారని తెలుస్తోంది. పైగా పోలింగ్ స్టేషన్ దగ్గర తన కుమార్తె తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలుసుకొన్న వెంటనే ఉద్వేగంతో అక్కడకు చేరుకొన్న భూమాను ఇరికించేందుకే రెచ్చగొట్టేలా ప్రవర్తించారని అర్థం అవుతోంది. అందుకే పోలీసులు, అధికారపక్షంతో చేతులు కలిపి ఈ కుట్రకు తెర తీసినట్లు తెలుస్తోంది.

 నాన్నపై కక్ష సాధింపు
 పోలింగ్ బూత్ దగ్గర తనను పోలీసులు దూషించారని ఎమ్మెల్యే అఖిల ప్రియ వెల్లడించారు. పోలింగ్ బూత్ దగ్గర జరిగిన ఘటనల్ని ఆమె మీడియాకు వివరించారు. పోలింగ్ స్టేషన్ లో ఓటు వేసేందుకు తాను వెళ్లినప్పుడు పోలీసులు గదమాయించే ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు. పది నిముషాల్లో ఓటు వేసి వెళతానని చెప్పినప్పటికీ వినకుండా వెంటనే ఓటు వేసి వెళ్లాలని పట్టు పట్టారని ఆమె అన్నారు. ఈలోగా డీఎస్పీ వచ్చి రూడ్ గా మాట్లాడిన సందర్భాన్ని అఖిల ప్రియ ఉదహరించారు. కూతురు ఒక్కతే ఉన్నప్పుడు పోలీసులు రూడ్ గా మాట్లాడితే ఒక తండ్రిగా రియాక్టు అయ్యారని అమె అన్నారు. సిల్లీ రీజన్సుతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె అన్నారు. ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని అఖిల ప్రియ అభివర్ణించారు.

 మెరుగైన వైద్యం నిరాకరణ
 చాతీ నొప్పి తో బాధపడుతున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కి పోలీసుల సమక్షంలో వైద్య పరీక్షలు జరిగాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అయినప్పటికీ పోలీసు అధికారుల మీద అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొని వచ్చారు. దీంతో ఎస్కార్టు పోలీసులు అందుబాటులో లేరంటూ తరలింపు ను వాయిదా వేస్తూ వచ్చారు. ఇదంతా కావాలని పోలీసులు చేస్తున్న హైడ్రామా అని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు.

3 July 2015

అవినీతి చేస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు

 ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదు?
 వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి
  కాకినాడ: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చేసి సంపాదించిన డబ్బును తెలంగాణలో బేరసారాలకు ఉపయోగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది.
  ఓటుకు కోట్లు కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి ఆడియో, వీడియో సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదో అర్ధం కావడం లేదని జగన్ పేర్కొన్నారు. సెక్షన్ 8 ముసుగులో చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారని జగన్ విమర్శించారు. ఎన్‌డీ తివారీకి ఒక న్యాయం చంద్రబాబుకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న లంచాలతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయన ఇలా అన్నారు... ‘‘సెక్షన్ 8 అనే టాపిక్‌ని చంద్రబాబు ఇవాళ ఎందుకు ముందుకు తీసుకువచ్చాడంటే టాపిక్‌ను డైవర్ట్ చేయడం కోసం. టాపిక్ డైవర్షన్ ఎందుకంటే నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకున్న డబ్బును పక్కరాష్ర్టంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం ఇస్తూ పట్టుబడిన పరిస్థితి రాష్ర్ట చరిత్రలోనే కాదు బహుశా దేశచరిత్రలోనే ప్రథమం కావచ్చు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఐదు కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇవ్వడానికి నేరుగా సంభాషణలు జరిపాడు. వీడియో రికార్డులు ఉన్నాయి. ఆడియో రికార్డులు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 నుంచి 20 కోట్లంటే దాదాపుగా 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వీడియో టేపులు దొరికాయి. ఇంత పబ్లిగ్గా అవినీతికి పాల్పడిన చంద్రబాబుని ఇంకా అరెస్టు చేయకపోవడం బాధనిపించే విషయం. ఎన్‌డీ తివారీ పట్టుబడినపుడు కథలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని చంద్రబాబు ఎంత రక్షించాడో తెలిసిన విషయమే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చాలా గొప్పది... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం.. అని చంద్రబాబు ప్రచారం చేశాడు. ఎన్‌డీ తివారీ చేసింది చాలా అన్యాయం.. తివారీ పదవిలో ఉండగా ఇలాంటివి చేయడం చాలా దుర్మార్గం.. ఆయన వెంటనే తప్పుకోవాలి అని చంద్రబాబు డిమాండ్ చేశాడు. ఇదే చంద్రబాబు ఇవాళ అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోతే ఇదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నా.. ఆరోజు నీతులు చెప్పిన చంద్రబాబు ఆ నీతులు తనకు వర్తించవని అనుకుంటున్నారా..?  ఒక ముఖ్యమంత్రి 150 కోట్ల రూపాయల బ్లాక్‌మనీతో అవినీతి చేస్తూ సాక్ష్యాలతో సహా పట్టుబడినా పదవిలో కొనసాగే హక్కు, నైతిక అర్హత ఎక్కడ ఉంటాయి.... అని అడుగుతున్నా..’’ అని జగన్ అన్నారు..
 మత్స్యకార కుటుంబాలకు బాబు సర్కార్ చేసిందేమీ లేదు..
 తుఫాన్ కారణంగా మరణించిన మత్స్యకారుడు పి.వెంకటేశ్వరరావు కుటుంబాన్ని శుక్రవారం పర్లోపేటలో జగన్‌మోహన్ రెడ్డి  పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరణించి ఇన్ని రోజులైనా మత్స్యకారుల కుటుంబాలకు రాష్ర్ట ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మత్స్యకారుల ప్రాణాలనున చంద్రబాబే తీశారని, వాతావరణ పరిస్థితులపై కనీసం హెచ్చరికలు కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఎలాంటి సాయం అందడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
 అందరికీ ఒకేరకమైన పరిహారం ఉండాలి
 రాష్ర్టంలో ప్రమాద వశాత్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఎవరికైనా సరే ఒకే రకమైన పరిహారం ఉండాలని జగన్ డిమాండ్ చేశారు. పబ్లిసిటీ వస్తుందంటే స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించడం.. పబ్లిసిటీ రాదనుకుంటే మంత్రులు వచ్చి తూతూ మంత్రంలా రెండు లక్షలు , లక్ష పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. పరిహారాన్ని ప్రకటించడమే గానీ ఆ తర్వాత అసలు ఎవరూ వచ్చి పలకరించే పాపాన పోవడం లేదని, బాధితులను ఆదుకోవడానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున ఎవరూ రావడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ మారాలని, రాష్ర్టంలో ఎక్కడ ఎవరు ప్రమాద వశాత్తూ ప్రాణాలు కోల్పోయినా ఐదు లక్షల పరిహారాన్ని అందించాల్సిందేనని, చంద్రబాబు వచ్చినా రాకపోయినా అందరికీ ఒకేవిధమైన పరిహారం అందేలా చూడాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. అందుకోసం రాష్ర్టప్రభుత్వంపై తాము తీవ్రంగా వత్తిడి తీసుకువస్తామని, అందరినీ ఆదుకునేలా చూస్తామని మత్స్యకార కుటుంబాలకు జగన్ హామీ ఇచ్చారు.

2 July 2015

చంద్రబాబు అవినీతి మహారాజు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

విశాఖపట్నం:  రాష్ట్ర ప్రభుత్వానికి పబ్లిసిటీ కావాలి తప్పితే ప్రజల అవసరాలు పట్టడం లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ప్రజల అవసరాలు పట్టించుకోవటం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్‌పర్యటించారు.
  మొదటగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకొని అక్కడ నుంచి రోడ్‌మార్గంలో ఎలమంచిలి నియోజక వర్గంలోని అచ్యుతాపురం చేరుకొన్నారు. ఇటీవల కాలంలో ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిలోకి వాహనం బోల్తా కొట్టిన ఘటనలో 22 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబంలో పుట్టెడు శోకం నెలకొంది. బాధితుల్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.ఈ ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా ఇప్పటిదాకా పరిహారం ఇవ్వలేదని జగన్ మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అందలేదని ఆయన అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి 22మంది చనిపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి పలకరించలేదని ఆయన గుర్తు చేశారు. మంత్రులు వచ్చి హడావుడిగా మీడియా ముందు పబ్లిసిటీ కోసం ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని, కానీ ఇందులో ఒక్క దమ్మిడీ కూడా విదల్చలేదని అభిప్రాయ పడ్డారు. ఇప్పటి దాకా ఎందుకు పరిహారం ఇవ్వలేదు, ఎందుకిలా మోసం చేస్తున్నారని వైఎస్ జగన్ నిలదీశారు. అప్పుడు మంత్రులు వచ్చి పబ్లిసిటీ కోసం సాయం చేస్తామంటూ ప్రకటనలు చేశారని, కానీ తర్వాత మాత్రం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కార్యక్రమం ఉంటే చంద్రబాబు వెళ్లి అక్కడ రూ. 5లక్షలు అందిస్తారని, వీళ్లు కూడా మనుషులే అని, కానీ రూ. 5లక్షలు ఎందుకు ప్రకటించలేదని ్రపశ్నించారు. వాళ్లకు ఇష్టం లేదంటే మాత్రం పరిహారం కూడా తగ్గిస్తారు, లేదంటే అస్సలు ఇవ్వనే ఇవ్వరని ఆయన అన్నారు. రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు కానీ ఒక్క రూపాయి  కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం దారుణంగా పనిచేస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు.  నాలుగు రోజులు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నాలుగు రోజుల్లో సహాయం అందించక పోతే ధర్నా కార్యక్రమం చేపడతామని అన్నారు. కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక్కడకు రాబట్టి కనీసం వీళ్లకు సాయం అందలేదన్న విషయం తె లిసిందని జగన్ అన్నారు.

 హత్య చేయటం తప్పు కాదు కానీ, వీడియో తీయటం తప్పా..!
 అనంతరం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు బయలు దేరారు. మార్గ మధ్యలో పాయకరావు పేట నియోజకవర్గం లోని నక్కపల్లి దగ్గర ఆగారు. పార్టీ నేతలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబురావులతో స్థానికపరిస్థితుల గురించి మాట్లాడారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై స్పందించారు. ఒక వ్యక్తిని హత్య చేయటం తప్పు కాదు కానీ, ఆ హత్యను ఎవరైనా వీడియో తీస్తే వీడియో తీయటం తప్పని చంద్రబాబు ఆంటున్నారని వైఎస్‌జ గన్ అన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్-8 అనేది ఒక అంశం మాత్రమే అని, తాను తప్పు చేసిన తర్వాత చంద్రబాబు కు ఆ సెక్షన్ గురించి గుర్తుకొచ్చినట్లుందని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యం గా ఉండాలని కోరుకొన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విభజనకు మొట్టమొదటిసారిగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఓటేసి మద్దతు తెలిపారు. ఆ రోజు చంద్రబాబు కు సిగ్గులేదు..బుద్ది లే దు. చాలా స్పష్టంగా రాష్ట్ర విభజనకు చంద్రబాబు పాలు పంచుకొన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో రాజకీయంగా మేం ఏ పార్టీకి మద్దతు ఇస్తే చంద్రబాబుకి ఎందుకు..! రాజకీయం కోసం ప్రజలను తప్పు దోవ పట్టించడం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజల్ని తప్పు దారి పట్టించేందుకే ఈ సెక్షన్ - 8 మీద రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. లంచాలు తీసుకొన్న డబ్బులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారని జగన్ అన్నారు. కరప్షన్ మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు.
 తూ.గో. జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
 అనంతరం వైఎస్ జగన్ రోడ్డు మార్గం గుండా తూర్పు గోదావరి జిల్లాలో అడుగు పెట్టారు. అక్కడ తుని నియోజకవర్గం లోని తొండంగి మండలం పెరుమాళ్లపాలెం, హుకుంపేట, కొత్తపట్నం, రామన్న పాలెం గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల కాలంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి అక్కడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. 

పొగాకు రైతులపై కనికరం లేదా? కష్టకాలంలో చేతులెత్తేసిన చంద్రబాబు

మద్దతు ధర లేక, కొనుగోళ్లు జరక్క పొగాకు రైతులు విలవిల్లాడుతున్నారు. అన్నదాత సంక్షేమం గురించి అనర్గళమైన ఉపన్యాసాలు దంచే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు రైతుల గురించి అసలు పట్టించుకోవడమే లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులను సాకుగా చూపుతూ పొగాకు బోర్డు చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా నీళ్లు నములుతోంది. చంద్రబాబు సర్కారు ఆదుకోవడానికి బదులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు రోడ్డునపడుతున్నారు. రహదారులను దిగ్బంధించి పంటను తగులబెట్టి తమ నిరసనను తెలియజేస్తున్నారు.
  మన రాష్ర్టంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకును విరివిగా పండిస్తున్నారు. జూన్ నెలాఖరుకు 80 నుంచి 90శాతం వరకు పొగాకు అమ్మకాలు జరగాల్సి ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 25శాతం కూడా అమ్మకాలు జరగలేదు. రాష్ర్టంలోని ఈ ఐదు జిల్లాల నుంచి 172 మిలియన్ కిలోల వర్జీనియా పొగాకును కొనుగోలు చేయాలని పొగాకు బోర్డు అధికారికంగా నిర్ణయించుకుంది. అయినా ఇప్పటి వరకు 45 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేసింది. గత ఏడాది సగటున కిలోకి రు.118.90 పలుకగా ఇపుడు రు.80 కూడా లేకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు రాష్ర్ట ప్రభుత్వమే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలి. కొనుగోళ్లు జరిగేలా చూడడం, కనీస మద్దతు ధర లభించేలా చూడడం ప్రభుత్వ బాధ్యత. కానీ చంద్రబాబు సర్కారు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. కనీసం పరిస్థితిని కేంద్రానికి వివరించి పొగాకు రైతును ఆదుకునేలా వత్తిడి కూడా చేయకపోవడం చంద్రబాబు మార్కు నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతుల నుంచి వివిధ రూపాలలో వసూలు చేసిన సుమారు. రు.500 కోట్లు బోర్డు వద్ద మూలుగుతున్నాయి. కనీసం ఆ నిధులతోనైనా పొగాకును బోర్డు నేరుగా కొనుగోలు చేసేతా వత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రికి రైతులు మొరపెట్టుకుంటున్నా చెవిటివాని ముందు శంఖమూదిన చందంలా మారింది.

 సంక్షోభసమయంలో ఆదుకున్న వైఎస్
 {పజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా 2003 చివర్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే 2004లో సంక్షోభ నివారణకు చర్యలు చేపట్టారు. వ్యాపారులంతా కుమ్మక్కై ధర పెరగకుండా చేస్తున్న తరుణంలో పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్యలను, కోల్ సొసైటీలను రంగంలోకి దింపారు. ఈ సంస్థలకు రు.10 కోట్ల రుణమిచ్చి పొగాకు కొనుగోలు చేయించారు. వరుసగా రెండేళ్లు ఈ విధంగా చేయడంతో ఓ దశలో కిలో పొగాకు ధర రు.199కి కూడా చేరింది. దాంతో పోటీ పెరిగి పొగాకు కంపెనీలు అనివార్యంగా కొనాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తికి ఇలాంటి సమగ్ర దృష్టి, సమస్యల పట్ల అవగాహన, ఆదుకునే మనస్తత్వం ఉండాలి. కానీ చంద్రబాబుకు అవేవీ లేకపోవడమే సమస్య. అందుకే ఆయన ఢిల్లీపై భారం వేసి చేతులెత్తేశారు.